టాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఆమె టాలీవుడ్ సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాలు అగ్రస్థానంలో కొనసాగారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్రశ్రేణి హీరోల సరసన నటించింది కాజల్. అయితే, గత కొన్ని సంవత్సరాల నుండి, కాజల్ కు కష్ట కాలం నడుస్తోంది, ఆమె నటించిన సినిమాల్లో ఒక్కటి కూడా హిట్ టాకును సొంతం చేసుకోలేకపోయాయి . అయినా టాలీవుడ్ లో ఆమెకు ఉన్న క్రేజ్ తో అవకాశాలు దక్కించుకుంటూ వస్తోంది.

 

2019లో కాజల్ సీత, రణరంగం అనే రెండు సినిమాల్లో నటించారు, రెండూ ఫ్లాప్ అయ్యాయి. సీత సినిమాలో కాజల్ ప్రధాన పాత్ర పోషించగా, రణరంగం సినిమాలో అసలు ఆమెకు ఎటువంటి ప్రాముఖ్యత లేదు. ఈ రెండూ కాకుండా, తమిళ చిత్రం కోమలిలో నటించింది, ఇక్కడ కూడా అదే ఫలితాన్ని చవిచూసింది కాజల్. సీత మరియు రణరంగం సినిమాల తరువాత కాజల్ అగర్వాల్ కు ఇంకా ఏ ఇతర సినిమా ఆఫర్ రాలేదు. కాజల్ అగర్వాల్ భారీగా ఆశలు పెట్టుకున్న సినిమా భారతీయుడు 2, ఈ సినిమాలో కాజల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం కాజల్ తన సినీ కెరీర్ ను కొద్ది రోజులు పక్కన పెట్టి తన కుటుంబ సభ్యులతో బాలిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.

 

కాజల్ అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసారు, ఇందులో ఆమె బికినీలో కనిపించింది. కాజల్ అగర్వాల్ బికినీ అందాలకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కాజల్ అందాలను తెగ పొగిడేస్తున్నారు. ఇప్పటికీ టాలీవుడ్ టాప్ హీరోయిన్ నువ్వే అంటూ కాజల్ పై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. తన బికినీ అందాలతో కుర్రకారు మతి పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. కమల్ సరసన కాజల్ నటిస్తున్న భారతీయుడు 2 సినిమా 2020వ సంవత్సరంలో విడుదల కానుంది ఈ సినిమా భారతీయుడు మూవీకి సీక్వెల్ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: