ఈ మ‌ధ్య కాలంలో హీరోలు సినిమాల్లో న‌టించ‌డ‌మే కాక వేరే కొత్త కొత్త యాంగిల్స్‌లో వాళ్ళ టాలెంట్‌ను బ‌య‌ట‌పెడుతున్నారు. రామ్ చరణ్ తనలోని ప్రతిభని తన ఫొటోల ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. రామ్ చరణ్ కేవలం సినీ జీవితానికి మాత్రమే పరిమితం కాలేదు. తాజాగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న రామ్ చరణ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫి ని చూసి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫి అద్భుతం అని నటి సమంత రామ్ చరణ్ ని ఇటీవలే కొనియాడిన సంగతి అందరికి తెలిసిందే. అయితే రామ్ చరణ్ తీసినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అవేంటో మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

 


రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం లో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రం లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తుంది. రామ్ చరణ్-ఎన్టీఆర్ లు నటిస్తున్న ఈ చిత్రం 2020 లో సంకా్రంతి కానుక‌గా విడుదల కానుంది.

 


ఈ ఫొటో ప్రదర్శన ద్వారా ప్రజలను చైతన్య పర్చడమే వీరి ఉద్దేశం. ఒక విధంగా ఇది రామ్ చరణ్ చేసే స్వచ్ఛంద సేవ. ఈ భూమిని, ప్రకృతిని కాపాడటం కోసం డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్. అనే స్వచ్ఛంద సంస్థ గత 60 ఏళ్లుగా పనిచేస్తోంది. అంతర్జాతీయంగా ఐదు మిలియన్ల సభ్యులతో 100 దేశాలలో ఈ సంస్థ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. పర్యావరణ మార్పుల కారణంగా ఆంద్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న తూర్పు కనుమల్లో అనేక వృక్షజాతలు, పక్షులు, కీటకాలకు రక్షణ లేకుండా పోయింది. కృత్రిమ వనరుల కల్పనతోనైనా వీటిని రపరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై వీరు దృష్టిపెట్టారు. మన భూమిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉందంటున్నారు రామ్ చరణ్. ‘ప్రకృతిలోకి నేను కెమెరాతో ప్రయాణించడానికి కారణం ఇదే. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా’ అన్నారు రామ్ చరణ్. ఆయన ఈ కార్యక్రమానికి పూనుకోడానికి కారణం ఆయన జీవిత భాగస్వామి ఉపాసన కొణిదెల. ఈ బృహత్తర కార్యకలాపాలు నిర్వహిస్తున్న డబ్ల్యు,డబ్ల్యు.ఎప్. సంస్థకు ఆమె రాయబారిగా వ్యవహరిస్తున్నారు. రామ్ చరణ్ కెమెరా వెనకున్న శక్తి ఉపాసనే సుమా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: