పవన్ నటించబోయే ‘పింక్’ రీమేక్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఇంకా స్పష్టమైన క్లారిటీ లేకపోయినా పవన్ క్రిష్ దర్శకత్వంలో నటించబోయే మరొక సినిమా కథకు సంబంధించిన విషయాలు ఇప్పుడు లీక్ అవుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో పవన్ ‘దొంగ’ గా కనిపిస్తాడని టాక్. 

మూవీ కథ మొఘలాయిల కాలానికి సంబంధించిన కథ అని పీరియాడిక్ డ్రామాగా రూపొందే ఈ మూవీ కోసం క్రిష్ టీమ్ ఇప్పటికే కథను సిద్ధం చేసి దొంగ అనే అర్ధం వచ్చే టైటిల్ కోసం అన్వేషణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మొఘలాయిల కాలంనాటి కాస్ట్యూమ్స్ సెట్స్ అప్పటి ఆయుధాలు ఇలా అన్ని విషయాలలోనూ చాల సహజంగా కనిపించేలా భారీ రీసర్చ్ జరుగుతున్నట్లు టాక్. 

వాస్తవానికి ఈ కథకు సంబంధించిన లీకులు బయటకు రానీయవద్దని పవన్ క్రిష్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా క్రిష్ టీమ్ లోని కొందరు అత్యుత్సాహం వల్ల ఈ కథ లీకులు బయటకు వస్తున్నాయి అని అంటున్నారు. ఒకప్పుడు డిటెక్టివ్ నవలలు మధుభాబు తరహా షాడో పాత్రలో పవన్ దొంగ పాత్ర ఉంటుందని అయితే ఆ పాత్రకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండటంతో అది మొఘాలాయిల కాలంలోకి వెళ్లి పోతుందని తెలుస్తోంది. 

మొత్తంమీద చూస్తే ఇది రాజమౌళి తరహా మూవీలో కథ నడుస్తుందని స్పష్టమైన లీకులు వస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటి వరకు పవన్ ఎప్పుడు ‘పింక్’ సెట్స్ మీదకు వస్తాడో తెలియదు. ఆ మూవీ పూర్తి అయితేకాని క్రిష్ మూవీ పూర్తికాదు. ఇలాంటి పరిస్థితులలో క్రిష్ ఎంతో కష్టపడి పరిశోధన చేసి తయారు చేసిన ఈ కథ ఎంతకాలం పవన్ గురించి ఎదురు చూడాలో వాస్తవానికి క్రిష్ కు కూడ తెలియని పరిస్థితి అని అంటునారు. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ తో తీవ్ర నిరాశకు లోనైన క్రిష్ ఇప్పుడు చివరి నిముషంలో పవన్ క్రిష్ కు హ్యాండ్ ఇస్తే ఆ షాక్ నుంచి కోలుకోవడం చాల కష్టమే అనుకోవాలి..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: