గ్రీకు వీరుడు నా రాకుమారుడు అంటూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసిన బ్యూటీ టబు.. ఎన్నో సినిమాలలో నటించింది. చిరంజీవి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ఇలా అందరి హీరోలతో జత కట్టిన ఈమె ఇప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదని అందరికీ తెలిసిన విషయమే.. హైదరాబాదీ హీరోయిన్ అంటే దేశవ్యాప్తంగా మంచి క్రేజ్. గ్లామర్ కు గ్లామర్ నటన పుష్కలంగా ఉన్న టబు తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన కూలి నంబర్ 1 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. టబు గ్లామర్ కు టాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు.

 

ఇక పోతే తెలుగులో వరుస  హిట్స్ అనుకున్న ఈ అమ్మడు.. తరువాత తెలుగు, తమిళ్, హిందీలో కూడా తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్న టబు .. ఇప్పటివరకు పెళ్లి మాత్రం చేసుకోలేదు. హీరోయిన్ గా చాలా రోజుల క్రితమే క్రేజ్ తగ్గడంతో ఇంట్లోనే ఉంటున్న టబు ఎందుకు పెళ్లి పై ఆసక్తి చూపించలేదు అన్న విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ప్రస్తుతం టబు, అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురంలో సినిమాలో కీ రోల్ పోషిస్తుంది.

 

ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా టబు ఓ ఛానెల్ కు ఇంటర్వూ ఇచ్చింది.. అయితే తాను  పెళ్లేందుకు చేసుకోలేదు అన్న విషయం పై మొదటి సారి నోరు విప్పింది. టబు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఓ బాలీవుడ్ హీరో అని చెప్పి షాక్ ఇచ్చింది ? ఇంతకీ ఎవరా హీరో ఏమా కథ అంటే .. ఆ బాలీవుడ్ హీరో ఎవరో కాదు అజయ్ దేవగన్ ?టబు హిందీలోకి ఎంట్రీ ఇస్తూ విజయ్ పథ్ అనే సినిమాలో నటించింది. ఆసినిమాలో హీరో అజయ్ దేవగన్. ఆ సినిమా తరువాత మంచి విజయాలు అందుకుని బాలీవుడ్ లోనే సెటిల్ అయింది టబు. అప్పటికే అజయ్ దేవగన్ తో మంచి స్నేహ సంబంధం కొనసాగిస్తుంది.


 

వివరాల్లోకి వెళితే .. ఆ హీరో  టబు కోసం ఓ ఇల్లు కూడా కట్టించాడట..ఈ విషయం పక్కన పెడితే టబు కు మొదటి నుండి అజయ్ దేవగన్ అంటే ఆసక్తి ఉందట. అజయ్ తన ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా కావడంతో అతని పై ఆశలు పెట్టుకున్నట్టుంది .. అజయ్ దేవగన్ వల్లే తాను పెళ్లి చేసుకోలేదని చెప్పి షాక్ ఇచ్చింది టబు? మొత్తానికి టబు పెళ్లి చేసుకోక పోవడానికి కారణం నాగార్జున కాదట.. అజయ్ దేవగన్ అని క్లారిటీ ఇచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి: