టాలీవుడ్ లో శంకర్ దాదా జిందాబాద్ మూవీ వరకు మెగాస్టార్ జైత్రయాత్ర కొనసాగించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల్లో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పర్చుకున్నారు.  అలాంటి మెగాస్టార్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని రాజకీయాల్లోకి వెళ్లారు.  పదేళ్లపాటు రాజకీయాల్లో కొనసాగిన చిరంజీవి తిరిగి వెండితెరపై రావాలని అనుకున్నారు.  కానీ ఆ ప్రయత్నానికి రెండేళ్లు పట్టింది.  మొత్తానికి తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కత్తి’ మూవీ రిమేక్ గా వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు.  ఈ మూవీలో చిరంజీవి ద్విపాత్రాభినయంలో కనిపించారు.  రైతుల కోసం పోరాడే యువకుడు, దొంగతనాలు చేసే మాస్ క్యారెక్టర్ పాత్రలతో దుమ్మురేపారు.  ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. తర్వాత తెలుగు మొట్టమొదటి స్వతంత్ర పోరాట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారాంగా ‘సైరా నరసింహారెడ్డి’ మూవీలో నటించారు.

 

 త‌న కెరీర్‌లో తొలిసారి ఇలాంటి చారిత్రాత్మ‌క మూవీ చేశారు. కానీ ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీలో నటించబోతున్న విషయం తెలిసిందే.  కొర‌టాల శివ‌తో క‌లిసి త‌న 152వ సినిమా చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఈ మూవీకి సంబంధించి రోజుకొక వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, అవి ఫ్యాన్స్‌లో అయోమ‌యాన్ని క‌లుగ‌జేస్తున్నాయి.  ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటుండ‌గా, ఈ సినిమాను మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు.

 

దేవాదాయ శాఖలో జరుగుతున్న అన్యాయాలపై ప్రతిఘటించే పాత్రలో కనిపించబోతున్నారట చిరంజీవి. సోషియా ఫాంట‌సీ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం దేవాదాయ శాఖలో జ‌రిగిన అవినీతి నేప‌థ్యంలో రూపొంద‌నున్న‌ట్టు తెలుస్తుంది. సంక్రాంతి త‌ర్వాత ప్రారంభం కానున్న ఈ మూవీలో చిరు న‌క్స‌లైట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌.  అయితే ఇది ఎంత వరకు నిజమో అన్న విషయం పై క్లారిటీ లేదు. చిరు సరసన స్టాలిన్ లో నటించిన త్రిష చాలా కాలం తర్వాత నటిస్తుంది. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ మూవీకి సంగీతం అందించ‌నున్నారు. గోవిందాచార్య అనే టైటిల్‌తో ఈ మూవీ ప్ర‌చారం జ‌రుపుకుంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: