స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన బాయ్స్ మూవీలో హీరోగా నటించిన సిద్దార్థ్ తర్వాత తెలుగు లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు మరికొన్ని మూవీస్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. దిల్ రాజు సమర్పణలో వచ్చిన బొమ్మరిల్లు సిద్దార్థ్ కి స్టార్ హీరో స్థాయి తీసుకు వచ్చింది. ఆ తర్వాత కొంచెం ఇష్టం..కొంచెం కష్టం మూవీ మ్యూజిక్ పరంగా బాగా ఆకట్టుకున్నా కమర్షియల్ హిట్ మాత్రం కాలేక పోయింది. ఆ తర్వాత సిద్దార్ద నటించిన సినిమాలు వరుస ఫ్లాపులు వచ్చాయి. ఆ మద్య గృహం లాంటి హర్రర్ సినిమాతో కనిపించిన సిద్దార్థ్.. ఈ మద్య వదలడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ మూవీలో సిద్దార్థ్ దెయ్యం పాత్రలో నటించారు..అంతే కాదు ఈ మూవి మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కావడం విశేషం. ఇటీవల వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సిద్ధార్ద్ తన మార్కెట్ని పెంచుకునేందుకు చాలా కష్టపడుతున్నాడు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్, హీరో సిద్దార్థ్ నటించిన తాజా సినిమా టక్కర్ టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. సిద్దార్థ్, దివ్యాంశ కౌశిక్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగిబాబు ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.
ఈ మూవీని ఫ్యాషన్ స్టూడియోస్ నిర్మిస్తున్నారు. తాజాగా సిద్ధార్థ్ ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇందులో గత సినిమాల భిన్నంగా అల్ట్రా స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చారు. చూస్తుంటే హాలీవుడ్ జేమ్స్ బాండ్ స్టైల్లో స్టిల్ ఉందని అభిమానులు తెగ సంబంరపడిపోతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో టక్కర్ విడుదల కానుంది. ఇక సిద్దార్థ్ భారతీయుడు 2 మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. అలాగే మరో తమిళ మూవీ ఆయన నటిస్తున్నారు. మరి ఈ మూవీ సిద్దార్థ్ కి ఎంత వరకు సక్సెస్ ఇస్తుందో చూడాలి.