టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వస్తున్న విషయం తెలిసిందే.  అయితే మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘చిరుత’ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు.  ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’తో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రికార్డుల మోత మోగించారు. గత ఏడాది సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ అయ్యింది. రెండు వందల కోట్ల క్లబ్ లో నిలిచింది.  ఆ తర్వాత వచ్చి వినయవిధేయ రామ డిజాస్టర్ గా నిలిచింది.  ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగానే కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

 

 ఇప్పటికే ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి మూవీస్ నిర్మించారు.  రామ్ చరణ్ రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసన కామినేని ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట కాస్త విశ్రాంతి దొరికిందంటే చాలు విదేశాల్లో ఎంజాయ్ చేసి వస్తుంటారు.  ఈ మద్య రామ్ చరణ్ తనలో రక రకాల వేరియేషన్స్ చూపిస్తున్నారు.  మొదటి నుంచి జంతు ప్రేమికుడైన రామ్ చరణ్ త‌న‌లో దాగి ఉన్న కొత్త టాలెంట్‌ని ఇటీవ‌ల బహిర్గ‌తం చేశాడు. వైల్డ్‌లైఫ్ యానిమ‌ల్స్‌ని త‌న కెమెరాలో బంధించ‌డాన్ని ఎంత‌గానో ఇష్ట‌ప‌డే రామ్ చ‌ర‌ణ్ త‌న కొత్త ఇంట్లో 'వైల్డెస్ట్ డ్రీమ్స్' పేరుతో ఓ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసాడు.

 

రీసెంట్ గా WWF ఇండియా సాయంతో రామ్ చరణ్ ఏర్పాటు చేసిన ఫోటోగ్ర‌ఫీ ఎగ్జిబిష‌న్‌ని ప్రారంభించిన విసయం తెలిసిందే.  ఈ హీరో తన టాలెంట్ తో తీసిన అందమైన ఫోటోస్ చూడటానికి సెలబ్రెటీలు రామ్ చరణ్ ఇంటికి క్యూ కడుతున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చిరుత‌ని త‌న కెమెరాలో బంధిస్తున్న స‌న్నివేశానికి సంబంధించిన ఫోటోని అప్‌లోడ్ చేశాడు రామ్ చ‌ర‌ణ్‌. ఈ ఫోటో నెటిజన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: