2019లో టాలీవుడ్‌లో విడుద‌లైన సినిమాలు అనేకం అయితే వాటిలో కొన్ని హిట్లుంటే మ‌రి కొన్ని ఫట్లున్నాయి. వీటిలో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్స్ అయితే మ‌రికొన్ని  యాక్ష‌న్‌, థ్రిల్ల‌ర్లుగా తెర‌కెక్కిన చిత్రాలెన్నో. వీటిలో హిట్లేంటో ఫ‌ట్లేంటో ఓ లుక్కేద్దాం...

 

మల్లేశం చిత్రం ... సామాన్య చేనేత కుటుంబంలో పుట్టి, ఆరో తరగతితో చదువు ఆపేసిన మల్లేశం తనవారి కష్టాలను తీర్చడానికి 'ఆసుయంత్రం' కనిపెట్టే ప్రయత్నంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు... చివరకు ఎలా విజయం సాధించారన్నదే ఈ సినిమా ఇతివృత్తం. ఒక సామాన్యుడి అసామాన్య విజయంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం అనగానే ఒక హైప్ ఏర్పడింది. దానికి తగినట్లే మల్లేశం ట్రైలర్లో కనువిందు చేసిన తెలంగాణ పలుకుబడులు, వాతావరణం వలన ప్రేక్షకులలో సినిమా పట్ల ఆసక్తి మరింత పెరిగింది. వాస్తవిక జీవితంలోని భావోద్వేగాలను మెలోడ్రామా లేకుండా సహజంగా మనసుకు హత్తుకునేలా ఆవిష్కరించే చక్కటి ప్రయత్నమే 'మల్లేశం' అని చెప్పవచ్చు.

 

ఏజెంట్ సాయిశ్రీ‌నివాస్‌... నెల్లూరు లోకల్ డిటెక్టివ్ కథ ఇది.  తనని తాను ఓ ఇంటిలిజెంట్ డిటెక్టివ్‌గా ఫీలయ్యే వ్యక్తి కథ ఇది. అయితే అతని చుట్టూ వున్న వాళ్లు మాత్రం ఎల్‌ఐసీ ఏజెంట్ అంటూ హేళన చేస్తుంటారు. ఎక్కడికి వెళ్లినా ఎవరూ పట్టించుకోరు. అలాంటి వ్యక్తి ఓ సీరియస్ కేసుని ఎలా పరిష్కరించాడు? అది అతని జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది అన్నదే ఈ చిత్ర కథ.  ఫస్ట్‌ లుక్‌, టీజర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. కొత్త దనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరిని ఈ సినిమా మెప్పించింద‌నే చెప్పాలి.

 

జెర్సీ...నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జెర్సీ’. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక.  హార్ట్ టచింగ్ స్టోరీ అందునా క్రికెట్ నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో జెర్సీ ని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి కరణ్ జోహార్ ముందుకు వచ్చాడట . 
ఇక ఇటీవలే కబీర్ సింగ్ తో సంచలన విజయం సాధిస్తున్న షాహిద్ కపూర్జెర్సీ రీమేక్ లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి .

 


ఖైదీ... తమిళ హీరో కార్తి సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. అంతలా ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. అందుకే ఆయన ప్రతి సినిమాను తెలుగులోకి అనువాదం చేస్తున్నారు. తాజాగా కార్తి హీరోగా నటించిన చిత్రం ‘ఖైదీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. థ్రిల్లర్ జోనర్ సినిమాలు ఇష్టపడేవారికి ఇది కచ్చితంగా నచ్చుతుందట. ఇప్పటి వరకు వచ్చిన ఉత్తమమైన థ్రిల్లర్స్‌లో ‘ఖైదీ’ ఒకటని అంటున్నారు. అద్భుతమైన నేపథ్య సంగీతం, ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన బలాలని చెబుతున్నారు.

 

జార్జిరెడ్డి...ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసిన జార్జ్‌ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఇటీవల జార్జి రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో నటించాడు. గత నెల విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు లభించగా.. బాక్సాఫీస్ వద్ద కూడా ప‌ర్వాలేదనిపించాడు జార్జిరెడ్డి. 

 

సైరా న‌ర్సింహారెడ్డి...మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొన్న సైరా నర్సింహారెడ్డి చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని సాధిస్తున్నది. ఈ చిత్రం భారీగా వసూళ్లను సాధించింది. సాత్వంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన హిస్టారికల్ మూవీ.. ‘సైరా నరసింహారెడ్డి’..

 

గ‌ద్ద‌లకొండ గ‌ణేష్‌... హీరో వరుణ్ తేజ్ నెగిటివ్ షెడ్ లో నటించిన తాజా చిత్రం గద్దలకొండ గణేష్... హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. మొదట్లో సినిమాకి టైటిల్ వివాదం ఏర్పడ్డప్పటికి మంచి టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా సినిమా దూసుకుపోతుంది.   అయితే వరుణ్ ఆ పాత్రకు తన గెటప్ ను మార్చుకున్న తీరుకే హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. చూడగానే ఒక విలన్ ని చూస్తున్నామన్న భావన తీసుకురాగలిగాడు. మొత్తానికి వాల్మీకి ఒకసారి హ్యాపీగా చూడదగ్గ చిత్రం.  హిట్ అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి.

 

మ‌న్మ‌థుడు2... ‘మన్మథుడు 2’ ట్విట్టర్ రివ్యూ: పొట్టచెక్కలు.. కామెడీ పీక్స్ ‘ఈ వయసులో మీకు పెళ్లేంటి సార్. ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోస్తే మళ్లీ పూలు పూస్తాయా?’.. రియల్ లైఫ్‌లో ఆరు పదుల వయసు అంటే ఆ మాత్రం డౌట్ ఉంటుంది మరి. అయితే ఖచ్చితంగా పూలు పూయిస్తా.. కాయలు కాయిస్తా అంటూ మోడల్స్‌ని కిస్‌లు కౌగిలింతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ‘మన్మథుడు 2’ చిత్రంతో నేడు థియేటర్స్‌లోకి ఎంటర్ అయ్యాడు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున.

 

రాక్ష‌సుడు...టాలీవుడ్‌లో  బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా అంటే తెలియకుండానే కొన్ని అంచనాలు వచ్చేస్తుంటాయి. బెల్లంకొండ కథ విషయంలో కాంప్రమైజ్ అయినా హీరోయిన్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాడు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం ‘రాక్షసుడు’ సినిమా ఓవర్సీస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయింది. ఈ సినిమా టాక్ విషయానికొస్తే.. ఈ థ్రిల్లర్ హిందీ డబ్బింగ్ హక్కులు 12.5 కోట్లకు.. శాటిలైట్ రైట్స్‌కు మరో 6 కోట్లు వచ్చాయి. దాంతో విడుదలకు ముందే చాలా వరకు సేఫ్ అయిపోయింది రాక్షుడు. ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పర్లేదు. ముందు సినిమాలు 20 కోట్లకు పైగా బిజినెస్ చేసినా కూడా ఇప్పుడు మాత్రం రూ. 16 కోట్లకు పడిపోయాడు బెల్లంకొండ.

 

ఓబేబి...సమంత లీడ్ రోల్ లో నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ చిత్రం విజయవంతంగా ఆడుతోంది. 70 ఏళ్ల బామ్మ‌.. 24 ఏళ్ల అమ్మాయిగా మారిన‌ప్పుడు ఏం జ‌రిగింద‌నే క‌థ‌తో తెరకెక్కిన ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సమంత నటనను ప్రశంసించారు. వసూళ్ల పరంగా ఈ చిత్రం మంచి రికార్డులను క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.38 కోట్ల‌ గ్రాస్ వ‌సూలు చేసిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. లాంగ్ రన్‌లో 50 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక యూఎస్‌లో ఈ చిత్రం వ‌న్‌ మిలియ‌న్ డాల‌ర్ క్లబ్‌లో చేరింది.

 

మ‌హ‌ర్షి...ఈ యేడాది సూపర్ స్టార్ మహేష్ బాబు .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన ‘మహర్షి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది. మహేష్ బాబు.. రిషి అనే స్టూడెంట్‌గా.. పెద్ద ఐటీ కంపెనీ ఓనర్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. దాంతో ఈ సినిమాలో అన్నం పెట్టే రైతును ఆదుకోవాలని ఈ సినిమాలో సూచించడు.   దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, అల్లరి నరేష్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: