బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో మంచి జోష్ మీదున్న నితిన్ కి పూరి కలిస్తే ఏమవుతుందంటే హార్ట్ ఎటాక్ వస్తుంది. అదేంటి అనుకుంటున్నారా.. అదేనండి వారిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హార్ట్ ఎటాక్ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్ష్క్స్ చేశారు దర్శక , నిర్మాతలు. నితిన్, అదాశర్మ జంటగా నటిస్తున్నా ఈ సినిమాతో పూరి మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చూపించబోతున్నాడు. ట్రైలర్స్ లో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్న నితిన్ ఈ సినిమాతో కూడా మంచి హిట్ సాదించవచ్చని అభిప్రాయ పడుతున్నాయి సినీవర్గాలు. ఇక అదాశార్మ అందాలు కూడా ఈ సినిమాకు చాలా ప్లస్ అవుతాయని చిత్ర యూనిట్ అనుకుంటున్నారు.. అనూప్ రూబెన్స్ కాంబినేషన్ లో ఆల్రెడీ రెండు మ్యూజిక్ హిట్లు సాదించిన నితిన్ ఈ సినిమాతో మరోసారి మంచి మ్యూజిక్ అందించనున్నాడు. మొదటి కాంబినేషన్ గా వస్తున్న పూరి,నితిన్ లు ఈ హార్ట్ ఎటాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్లీ మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వాలని ఆశిద్దాం.పూరి తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న సినిమా కాబట్టి తను చాలా కేర్ ఫుల్ గా మూవీని తీస్తున్నాడట. ఈ సినిమా ఎక్కువ భాగం స్పెయిన్ లో షూట్ చేసుకుంది. ఇప్పటికే నెట్ లో హార్ట్ ఎటాక్ లో నితిన్ పోస్టర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.సో వీరి కలయిక అభిమానులకు హార్ట్ ఎటక్ తెప్పిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: