టైటిల్ చూసి మీరు తప్పుగా అనుకోవద్దు.. నరసింహుడు, అశోక్ వంటి సినిమాలతో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కి జోడీగా నటించిన సమీర త్వరలో పెళ్లి చేసుకోబోతుంది.. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో రొమాన్స్ చేసిన భామల్లో సమీరా స్పెషల్ అని చెప్పాలి ఎందుకంటే వారి మధ్య కెమిస్ట్రీ సూపర్ గా వర్క్ అవుట్ అయ్యింది. నరసింహుడు అంతగా ప్రేక్షకాదరణ పొందక పోయినా, అశోక్ లో మాత్రం ఎన్.టి.ఆర్ , సమీరా ల లవ్ సీన్స్ సూపర్ గా ఉంటాయి.. ఏకాంతం గా ఉన్నా.. ఎందరి మధ్యన ఉన్నా.. అంటూ మన యంగ్ టైగర్ సమీరాను తలచుకుని సాంగ్ పాడుతుంటే చాలా ఎంజాయ్ చేశారు ఆడియెన్స్. సమీరా రెడ్డి తెలుగమ్మాయి అయినా మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి హీరోయిన్ గా అయి..తెలుగులో చిరంజీవి వంటి టాప్ హీరో తో కూడా నటించింది. ఇక అందరు వయసయిపోతున్న హీరోయిన్లు బ్యాగ్ సర్దేస్తున్నారు కాబట్టి తను కూడా ఇక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఓ పెద్ద మోటార్ కంపెనీ సి.ఈ.ఓ తో ప్రేమలో పడ్డ సమీరా, ఇంట్లో వాళ్ల అంగీకారంతో పెళ్లీ చేసుకోబోతుంది. ఆల్రెడీ ఎంగేజ్ మెంట్ కూడా జరిగిన సమీర పెళ్లి ఫిబ్రవరి లో పెట్టుకుందట. సో మొత్తానికి సీనియర్ హీరోయిన్లంతా బ్యాక్ టు పెవిలియన్ అన్నట్లుగా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుంటున్నారు.ప్రేక్షకుల మనసులలో దేవతలా ఆరాదించబడిన వెండితెర తారలు ఇలా ఎప్పటికైనా ఓ ఇంటి ఇల్లాలుగా వెళ్లడం తప్పదు అనిపిస్తుంది. ఇక సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాతో ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేసిన సమీరా పెళ్లైన తర్వాత మరళ ఇండస్ట్రీ వెపి వస్త్యుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి రెండు సినిమాల్లో ఎన్.టి.ఆర్ కి లవర్ గా చేసిన సమీరా పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అవ్వబోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: