స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన లుక్స్‌, పాట‌లు, టీజ‌ర్ బాగా ఆక‌ట్టుకున్నాయి.

 

ఇదిలా ఉంటే.. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి నిడివి పెద్ద ప్రాబ్లెమ్ కానుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ సినిమా కథ,స్క్రీన్ ప్లే బాగుంటతే.. రన్ టైమ్ కాస్తా ఎక్కువగా ఉన్నా ప్రేక్షకులు ఓపికతో ఆదిరిస్తారు. ఏ మాత్రం కాస్తా అటూ ఇటూ అయినా సినిమా సంగతులు అంతే అని చెప్పాలి. ఏవో అపుడపుడు అర్జున్ రెడ్డి, రంగస్థలం లాంటి సినిమాలు వీటికి మినహాయింపు అని చెప్పాలి. అయితే ‘అల వైకుంఠపురములో’ సినిమాను అల్లు అర్జున్‌కు త్రివిక్రమ్ 2 గంటల 25 నిమిసాలు అని చెప్పాడట. తీరా ఫైనల్ కట్ చేస్తే.. 3 గంటలకు పైగా వచ్చిందట. సినిమాలో ముఖ్యమైన సన్నివేశాలతో పాటు కామెడీ,యాక్షన్ సీన్లు చాలా ఉన్నాయని తెలుస్తోంది.

 

గ‌తంలో అల్లు అర్జున్ గత చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కు రన్ టైమ్ ఎక్కువ కావడం వల్లే సినిమా పోయిందని చెబుతున్నారు. మ‌ళ్లీ ఇప్పుడు అదే స‌మ‌స్య అల వైకుంఠ‌పురంలో సినిమాకు వ‌చ్చి పడంది. మ‌రి త్రివిక్ర‌మ్ జాగ్ర‌త్త‌గా సీన్స్ క‌ట్ చేస్తాడా లేదా థైర్యంతో ముందుకు వెళ్తాడా అన్నది చూడాలి. కాగా, ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌తి 12న‌ ఈ చిత్రం రీలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: