టాలీవుడ్ సినిమా పరిశ్రమకు దేవదాసు అనే సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ఇలియానా, తొలి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకోవడం జరిగింది. ఆ తరువాత పురీ జగన్నాథ్ దర్శకతంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన పోకిరి సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ, అనూహ్యంగా ఆ సినిమా అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ ని అందుకోవడంతో ఒక్కసారిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 

 

అక్కడి నుండి పలువురు టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించిన ఇలియానా, కొన్నాళ్ల క్రితం సినిమాలు చేయడం చాలావరకు తగ్గించింది. అనంతరం తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ప్రేమాయణం నడిపి, ఇటీవల అతడి నుండి విడిపోయిన ఈ భామ, ప్రస్తుతం తన ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి గోవాలో ఉంటోంది. అయితే గతంతో పోలిస్తే బాగా బొద్దుగా తయారయిన ఇలియానా, కొద్దిరోజుల క్రితం రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా ఆమెకు చేదు ఫలితాన్నే ఇచ్చింది. అలానే అక్కడక్కడా నటించిన బాలీవుడ్ సినిమాలు కూడా ఆమెకు పెద్దగా సక్సెస్ ని అందివ్వలేదు. ఇకపోతే అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ హీరోగా, 

 

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాలో ఒక కీలక పాత్రలో ఇలియానా నటించనుందని నేడు పలు ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. గ్యాంగ్ స్టర్ కథగా రూపొందుతున్న ఈ సినిమాలో, కథను మలుపు తిప్పే ఒక కీలక లేడీ క్యారెక్టర్ కోసం దర్శకుడు వంశీ, ఇలియానాను తీసుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై ఎక్కడా కూడా అధికారిక సమాచారం లేనప్పటికీ, ఒకవేళ ఇది నిజం అయితే  మాత్రం, కొన్నేళ్ల తరువాత సూపర్ స్టార్, ఇలియానా కాంబినేషన్ ని తెరపై చూడవచ్చన్నమాట......!!

మరింత సమాచారం తెలుసుకోండి: