‘అజ్ఞాతవాసి’ మూవీలో మురళీ శర్మ పవన్ కళ్యాణ్ పాత్రను ఉద్దేశిస్తూ ‘వీడి లీలలు అర్ధం కావు’ అంటూ ఒక సెటైరికల్ పంచ్ డైలాగ్ వాడుతాడు. త్రివిక్రమ్ కలం నుండి జాలువారిన ఆ డైలాగ్ అప్పట్లో పాపులర్. ఇప్పుడు రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ లీలలు కూడ ఎవరికీ అర్ధంకాక జనసైనికులు కూడ తల పట్టుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఆ రాష్ట్రానికి సంబంధించి మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో కీలక నిర్ణయం తీసుకోవడానికి చాల వేగంగా అడుగులు వేస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ నెల 27న జరగబోతున్న క్యాబెనెట్ సమావేశంలో ఈ మూడు రాజధానుల విషయమై ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. 

ఇలాంటి పరిస్థితులలో జగన్ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం తెలిసిన తరువాత దానిమీద తీవ్ర నిరసన తెలియచేయడానికి అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితులలో పవన్ ఏవిధంగా స్పందిస్తాడు అని అందరు ఎదురు చూస్తుంటే పవన్ క్రిస్మస్ సంబరాల కోసం తన భార్య పిల్లలతో కలిసి తన అత్తవారి దేశం రష్యా వెళ్ళినట్లు వస్తున్న వార్తలు చాలామందికి షాక్ ఇస్తున్నాయి. 

ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకల కోసం పవన్ తన భార్య అన్నాతో కలిసి రష్యాలోని మాస్కో కు వెళ్ళి అక్కడ క్రిస్మస్ సంబరాలను జరుపుకుని న్యూఇయర్ వేడుకలు కూడ పూర్తి అయినతరువాత తిరిగి భాగ్యనగరానికి రావడం పవన్ అలవాటు. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ అంతా ఈ మూడు రాజధానుల నిర్ణయంతో ఆశ్చర్యపోతూ అమరావతిలోని రైతులు రగిలిపోతున్న నేపధ్యంలో ఇలాంటి కీలక సమయంలో పవన్ ఆంధ్రప్రదేశ్ లో ఉండకుండా రష్యా వెళ్ళిపోతే జనసైనికులకు దిశానిర్దేశం ఎవరు చేస్తారు అంటూ కొందరు ఆశ్చర్యపోతూ ఉంటే మరికొందరు రాజకీయ నాయకుడుగా పవన్ మరొక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: