టాలీవుడ్ అగ్రశ్రేణి ప్రొడక్షన్ హౌస్ అయిన సురేశ్ ప్రొడక్షన్స్ గురించి ప్రత్యేకించి చెప్పేదేమీ లేదు. సినిమా నిర్మాణ రంగంలో 50ఏళ్లకు పైగా నిలబడిన నిర్మాణ సంస్థల్లో ఇది కూడా ఒకటి. రామానాయుడు ఈ సంస్థను స్థాపించి శిఖర స్థాయి కల్పించారు. ఆయనతో పాటు.. తర్వాత కూడా సంస్థ బాధ్యతలను ఎంతో నిబద్ధతో నిర్వహిస్తూ బ్యానర్ వాల్యూను కాపాడుకుంటున్నారు సురేశ్ బాబు. డిసెంబర్ 24న ఆయన జన్మదినం. ఈ సందర్భంగా తనయుడు రానా సోషల్ మీడియా ద్వారా తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.

 

 

‘హ్యాపీ బర్త్ డే మై డియర్ ముఫసా.. (ముఫసా.. అనేది పేరు. ఇటివల విడుదలైన ది లయన్ కింగ్ సినిమాలో సింబా తండ్రి.. అడవికి రాజైన సింహం పేరు కూడా ముఫసానే) మీరు  మాకెంతో గర్వకారణం' అని అర్ధం వచ్చేలా తన వాల్ లో రాసుకున్నాడు. సరేశ్ బాబు సినిమా నిర్మాణంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడో చాలా మంది కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయం తెలిసిందే. కథ విషయంలో ఎంతో స్ట్రిక్ట్ గా ఉండే సరేశ్ తన అనమానాలన్నీ నివృత్తి చేసుకుంటారని చెప్తారు. ఆయన సెట్లో ఓ ప్రిన్సిపల్ గా ఉంటారని కూడా చెప్తారు. ఎంతో స్ట్రిక్ట్ గా ఉండబట్టే ఎందరో ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ అనేక కొత్తమందితో సినిమాలు నిర్మిస్తున్నారు.

 

 

‘పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, కేరాఫ్ కంచరపాలెం, ఓ బేబీ, రాజావారు.. రాణివారు, వెంకీ మామ..’ వంటి హిట్స్ తో దూసుకుపోతున్నారు. రామానాయుడు ఎంత నిబద్దతో సినిమాలు తీసేవారో సురేశ్ కూడా అంతే క్రమశిక్షణతో ఉండబట్టే అనేక కొత్త కథలు, కొత్త దర్శకులు, నటీనటులు తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి మరిన్ని మంచి సినిమాలు రావాలని ప్రేక్షకులు కోరుకుంటారనడంలో అతిశయోక్తి లేదు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Happy Birthday my dear Mufasa!! @SBDaggubati 💥💥💥💥💥 Thank you for being You!! ❤️

A post shared by rana Daggubati (@ranadaggubati) on

మరింత సమాచారం తెలుసుకోండి: