టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్..ఇలా ఎక్కడైనా కొన్ని కాంబినేషన్స్ సెట్ చేయడానికి దర్శక, నిర్మాతలు ఎంతగా ప్రయత్నాలు చేస్తారో..ఆ కాంబినేషన్ ని స్క్రీన్ మీద చూడటానికి కూడా ప్రేక్షకులు అంతకంటే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఇక బాలీవుడ్ లో 'మహాభారతం' సినిమా గురించి ప్రకటన వెలువడినప్పటి నుంచి టాలీవుడ్ లోనూ ఈ సినిమాపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. మధుమంతెన నిర్మాతగా దీపిక పదుకొనే సహనిర్మాతగా పలు కార్పొరెట్ కంపెనీల అండతో ఈ ప్రాజెక్ట్ ఒక ఫ్రాంఛైజీ గా సెట్స్ పైకి వెళ్లనుందని లేటెస్ట్ న్యూస్. బహుభాషల్లో మహాభారతంని తెరకెక్కించాలన్నది ప్లాన్. అయితే ఇటీవల కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న మేకర్స్ తాజాగా దీపికను ద్రౌపది పాత్ర కు కన్‌ఫర్మ్ చేస్తూ ప్రకటించేయడం ఇప్పుడు బాలీవుడ్ లో ఆసక్తిని రేకెత్తించింది.

 

ఆ క్రమం లోనే ఈ సినిమాలో శ్రీకృష్ణుడు సహా ఇతర పాత్రల్లో ఎవరెవరు నటిస్తారు? అన్నది ఆసక్తిగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. శ్రీకృష్ణుడి పాత్ర కోసం హృతిక్ రోషన్ తో మధు మంతెన మాటలు జరిగాయని తెలుస్తోంది. వాస్తవానికి ఈ పాత్రకు అమీర్ ఖాన్ కానీ అక్షయ్ కుమార్ కానీ అయితే బావుంటుందని మేకర్స్ భావించినట్టు ఇంతకముందు వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఈ పాత్రకు హృతిక్ ని సంప్రదించడం ఆసక్తికరంగా మారింది.

 

ఇక ఈ ప్రతిష్ఠాత్మక సినిమాలో ద్రౌపది పాత్రలో దీపికను తప్ప వేరొకరిని ఊహించుకోలేనని ఈ సందర్భంగా మధు మంతెన అన్నారు. బాజీరావ్ మస్తానీ- పద్మావత్ సినిమాలు చూశాక రాణి పాత్ర అంటే దీపికనే అన్న భావన కలిగిందని వ్యాఖ్యానించారు. ద్రౌపది కోణంలో తెరకెక్కే ఈ సినిమాలో దీపిక చేరికతో అంతర్జాతీయ స్థాయి అప్పీల్ పెరిగిందని అన్నారు. తెలుగు- హిందీ సహా అన్ని భాషల్లోనూ ఈ సినిమాని రూపొందించనున్నారు. ఒక సిరీస్ గా తెరకెక్కే ఈ సినిమా నుంచి తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది అని తెలిపారు. ఇక అమీర్ ఖాన్ మహాభారతం సిరీస్ ని అటకెక్కించిన అనంతరం దీపిక-మధు మంతెన కాంబినేషన్ ప్రయత్నాలు ఆసక్తిని పెంచుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: