ఈ రోజుల్లో సినిమాతో టాలీవుడ్ కు  దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన మారుతి ఆ తర్వాత అంచలంచలుగా ఎన్నో సినిమాలు చేస్తూ మంచి పేరును సంపాదించుకున్నారు. ప్రేక్షకుల్లో దర్శకుడు మారుతి సినిమా అంటే మినిమం గ్యారంటీ సినిమాగా ముద్ర పడిపోయింది. ఇక మారుతి సినిమాల అంటే ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కంటనీరు పట్టిస్తున్నాడు మారుతి. దీంతో మారుతి నుంచి ఏదైనా సినిమా వస్తుంది అంటే... అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. అయితే తాజాగా ప్రతి రోజు పండుగ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు మారుతి. ఈ సినిమాలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన నటనతో ఆకట్టుకున్నారు. 

 


 ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా  తెరకెక్కిన ప్రతి రోజు పండుగే  సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తు మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. ఇటీవలే తాను దర్శకత్వం వహించిన ప్రతి రోజు పండుగే  సినిమా భారీ విజయాన్ని సాధించడంతో... మారుతి మరో సినిమా కోసం సిద్ధమయ్యారు. మరో సినిమా కోసం సన్నాహాలు మొదలు పెట్టాడు దర్శకుడు మారుతి. ఈసారి తన దర్శకత్వానికి ఎనర్జీని తోడు చేయాలనుకుంటున్నాడు దర్శకుడు మారుతి. ఈ నేపథ్యంలో దర్శకుడు మారుతి తదుపరి సినిమా ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఉందని బలంగా టాక్  వినిపిస్తోంది. 

 

 అయితే మారుతి చేతిలో ముగ్గురు నలుగురు నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. దీంతో వారిలో ఎవరు ఎనర్జిటిక్ స్టార్ రామ్  తో సినిమా చేయడానికి ఆసక్తి గా ఉంటారో  వాళ్లతో మారుతి సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మారుతి తన తదుపరి సినిమా గురించి ఇప్పటికే ఎనర్జిటిక్ స్టార్  రామ్ తో సంప్రదింపులు జరిపారు అని కూడా టాక్  వినిపిస్తోంది. ఒకవేళ మారుతి సినిమాకు రామ్ ఓకే చెప్తే ఇద్దరి కాంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఇది  ఎంత వరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ ప్రకటన రావాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: