సోనాల్ చౌహాన్..బాలయ్యకు బాగా కలిసొచ్చిన, నచ్చిన హీరోయిన్. ముందుగా తెలుగులో రేయిన్‌బో సినిమాలో ఒక కుర్ర హీరోతో నటించింది. అయితే ఆ సినిమా వచ్చింది..పోయింది అన్నట్టుగానే మిగిలింది. కానీ ఆ తర్వాత చాన్నాళ్ళకి నటసింహా నందమూరి బాలకృష్ణ సరసన 'లెజెండ్' సినిమాలో నటించింది సోనాల్ చౌహాన్. బోయపాటి అదిరిపోయే ఆఫర్ ఇవ్వడంతో ఆ తర్వాత ఈ బ్యూటీ పేరు అంతటా మార్మోగింది. లెజెండ్ విజయం సాధించడం సోనాల్ కు బాగా కలిసొచ్చింది. ఆ తర్వాత శ్రీవాస్ మరోసారి 'డిక్టేటర్' కోసం బరిలో దించాడు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు. కారణం ఏదైనా.. సోనాల్ కి మళ్లీ వేరొక అగ్ర కథానాయకుడు టాలీవుడ్ లో అవకాశం ఇవ్వలేదు. తిరిగి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ బాలయ్య నటించిన 'రూలర్' కోసం కె.ఎస్.రవికుమార్ లాంటి సీనియర్ దర్శకుడు సోనాల్ నే ఎంపిక చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. లెజెండ్ సినిమాలో ఏ స్థాయిలో గ్లామర్ ట్రీటిచ్చిందో అంతకుమించి రూలర్ లోనూ విపరీతంగా రెచ్చిపోయి గ్లామర్ ట్రీటిచ్చింది ఈ ముంబై ముద్దుగుమ్మ.

 

స్పైసీ లుక్స్ తో కుర్రాళ్ల గుండెల్ని దోచేసింది. అయితే దురదృష్టం కొద్దీ ఈసారి సోనాల్ ఆశలన్నీ ఆవిరైపోయాయి. రూలర్ డిజాస్టర్ టాక్ తన కెరీర్ కి కూడా మైనస్ కాబోతోంది. సెంటిమెంటు పరిశ్రమలో హిట్టు మాత్రమే మరో ఛాన్స్ ఇస్తుంది. ఇక ప్రస్తుత సన్నివేశంలో మరోసారి ఛాన్సుంటే బాలయ్యనే తనని ఆదుకోవాలేమో! సోనాల్ బాలీవుడ్ లోనూ ప్రస్తుతం జీరో. స్కై ఫైర్ అనే వెబ్ సిరీస్ లో నటించినా .. ఆ తర్వాత బాలీవుడ్ ఆఫర్స్ ఏవీ రాలేదు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో హీటెక్కించే ఫోటోషూట్లతో అభిమానులకు టచ్ లో ఉంటోంది. 

 

మరి ఇప్పుడు సోనాల్ పరిస్థితి నిజంగా ఏంటని తన ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఒక్క బాలీవుడ్ సినిమా ఛాన్సు లేదు. టాలీవుడ్ లో వచ్చిన ఆ ఒక్క ఛాన్స్ కూడా సోనాల్ కి హెల్ప్ అవ్వలేదు. పోనీ కియారా లా లస్ట్ స్టోరీస్ లాంటి వెబ్ సిరీస్ లో ఏమైనా ఛాన్సులు వస్తాయా అంటే కనుచూపు మేర ఎక్కడా ఆ అవకాశం కనిపించడం లేదు. ఇలా హాట్ హాట్ ఫొటోషూట్లు చేసుకొని సోషల్ మీడియాలో పెడితే జనాలు లక్షల్లో లైకులిస్తారు గానీ డబ్బులెవరిస్తారు సోనా..!కాస్త దాని గురించి కూడా ఆలోచించు. మొత్తానికి బాలయ్య రూరల్ రూపంలో ఇచ్చిన స్ట్రోక్ కి నిజంగా సోనాల్ కి ఏదో అయిపోయిందని కొందరు నెటిజన్లు తను పోస్ట్ చేసిన ఫొటోస్ చూసి కామెంట్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: