'ట్వైలైట్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు హాలీవుడ్ నటుడు రాబర్ట్ పాటిన్సన్. ఇప్పుడు ఆయన ‘ది బ్యాట్‌మ్యాన్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బ్యాట్ మ్యాన్‌గా ఇంతకముందు హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్ నటించాడు. కానీ కొన్ని కారణాల వల్ల వార్నర్ బ్రదర్స్ సంస్థ బెన్ స్థానంలో రాబర్ట్ పాటిన్సన్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. మ్యాట్ రీవ్స్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారు. ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. అప్పుడే ఈ సినిమా ఆడుతుందో లేదో అన్న భయం పట్టుకుంది రాబర్ట్ కి.

 

సినిమా ఆడితే ఫర్వాలేదు కానీ ఆడకపోతే మాత్రం మరో కెరీర్‌ను సిద్ధంగా ఉంచుకున్నానని అంటున్నాడు. ఇంతకీ ఆ కెరీరేంటో తెలుసా.. పోర్న్ ఇండస్ట్రీ. అవును ‘ది బ్యాట్‌మ్యాన్’ సినిమా హిట్ అవ్వకపోతే పోర్న్ ఇండస్ట్రీలోకి వెళ్లిపోతానని సిగ్గు పడకుండా అంటున్నాడు. ఇందుకు కారణం ఫ్యాన్స్‌ తనపై పెడుతున్న ఒత్తిడే. ది బ్యాట్‌మ్యాన్ సినిమాకు రాబర్ట్ ప్యాటిన్సన్ న్యాయం చేస్తాడో లేదోనని ఫ్యాన్స్ వార్నర్ బ్రదర్స్ సంస్థకు తెగ లెటర్స్ రాస్తున్నారట. దాంతో బ్యాట్‌మ్యాన్‌గా అతను బాగా సరిపోతాడని అందులో ఏమాత్రం సందేహం లేదని సంస్థ క్లారిటి ఇచ్చింది. ఈ నేపథ్యంలో బ్యాట్ మ్యాన్ హిట్ అవ్వకపోతే ఆ తర్వాత పరిస్థితి ఏంటి? అన్న విషయంపై రాబర్ట్ తన నెక్స్ట్ ప్లాన్స్ ని చెప్పి అందరికి షాకిచ్చాడు. ఒకవేళ బ్యాట్‌మ్యాన్ సినిమా ఫెయిల్ అయితే పోర్న్ ఇండస్ట్రీకి వెళ్లిపోతాను.

 

కానీ పోర్న్ అంటే అందరూ చేసే అసభ్యకరమైన పనులు కాదు. ఆర్ట్ హౌస్ పోర్న్‌ వైపు వెళ్తాను. ఏదేమైనా నాకు నేనే క్రిటిక్‌ను కాబట్టి ఈ సినిమా బాగా ఆడాలని నా వంతు నేను కష్టపడతాను. సినిమాపై అంచనాలు ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడితే నన్నో ఇడియట్‌లా చూస్తారు. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కూడా కాలేదు. కానీ నన్ను మించిన విమర్శకుడు మరొకరు ఉండరు. కాబట్టి నేను ఇతర విమర్శకుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బ్యాట్ మ్యాన్ రోల్‌కి ఎంతో పవర్ ఉంది. చాలా మందికి బ్యాట్ మ్యాన్ అంటే ఇష్టం అని తెలిపారు. 2020లో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం రాబర్ట్ ప్యాటిన్సన్ క్రిస్టోఫర్ నొలాన్ డైరెక్ట్ చేస్తున్న ‘టెనెట్’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటి డింపుల్ కపాడియా కీలక పాత్రలో నటించారు. ఇక రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: