భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటక తర్వాత కొద్దిగా బలపడే అవకాశం ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఇటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎటువంటి ప్రజా సమస్య ప్రభుత్వంపై అధికార పార్టీ పై వచ్చిన వెంటనే బిజెపి పార్టీ రంగంలోకి దిగి అందుకు తగ్గట్లు రాజకీయ ఎత్తుగడలు వేస్తూ ఎప్పటికప్పుడు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీని ముప్పు తిప్పలు పెడుతూనే ఉంది. ఎక్కడ ఎటువంటి సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఎదురైనా వెంటనే తెలంగాణ బిజెపి పార్టీ నేతలు టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ గా చేసుకుని అద్భుతమైన రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు. మరోపక్క కేంద్రంలో కూడా బిజెపి పార్టీ అధికారంలో ఉండటంతో కేంద్ర మంత్రులు కూడా తెలంగాణ బిజెపి పార్టీ నాయకులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు.

 

రాబోయే ఎన్నికల లోపు తెలంగాణ లో కచ్చితంగా బీజేపీ జెండా ఎగురవేయాలని తెలంగాణ బిజెపి నేతలకు బీజేపీ అగ్రనేతలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ఇందుమూలంగా స్వయంగా బిజెపి పార్టీ అధ్యక్షుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగి తెలంగాణలో పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. దీంతో ఆ పార్టీ నాయకులు మరింత ఉత్సాహం పెరిగి బాగా యాక్టివ్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అనుకూలమైన ఫలితాలు రావడంతో బిజెపి నేతలు మరింత ఉత్సాహం పెరిగింది.

 

అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. విషయంలోకి వెళితే ఇటీవల తెలంగాణ బిజెపి పార్టీ నాయకులు సీఎం కేసీఆర్ విషయంలో దూకుడుగా వివాదాస్పద కామెంట్లు చేస్తున్న తరుణంలో అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట దీంతో పార్టీ నేతలు తలలు పట్టుకున్న ట్లు సమాచారం. అయితే అమిత్ షా వ్యాఖ్యలు చేయటం వెనకా కారణం ఏంటో తెలియలేక తెలంగాణ బిజెపి పార్టీ నాయకులు కన్ఫ్యూషన్ లో కూడా పడినట్టు సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: