టాలీవుడ్ మొదలుకొని హాలీవుడ్ వరకు చేరిన క్యాస్టింగ్ కౌచ్ అంశంపై ఇప్పటికే కొందరు నటీమణులు తమకు జరిగిన వేధింపుల విషయాలు బయట పెట్టడం జరిగింది. ఇకపోతే నేడు మరొక బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్, తనకు కూడా క్యాస్టింగ్ కౌచ్ పేరుతో వేధింపులు జరిగాయని సంచలన నిజాన్ని ఒక ఆంగ్ల మీడియా పత్రికతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే, కొన్నేళ్ల క్రితం రణబీర్ కపూర్ అలానే దీపికా పడుకొనే కలయికలో తెరకెక్కిన ఏ జవానీ హై దీవాని అనే సినిమా రిలీజ్ అయి మంచి హిట్ సాధించిన విషయం తెలిసిందే. 

 

అయితే ఆ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించి మంచి పేరు దక్కించుకున్న కల్కి, ఆ తరువాత సినిమా ఆఫర్లు వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూసిందట. ఆ విధంగా కొన్ని నెలలు గడిచిన తరువాత ఒక ప్రముఖ హీరో సినిమాలో తనకు అవకాశం దొరికిందని, అయితే ఆ సినిమాలో నటించడానికి గాను సినిమా నిర్మాత తనను లైంగికంగా కోరికలు తీర్చమని కొంత పరోక్షంగా బలవంత పెట్టాడని, అయితే అందుకు తాను మాత్రం తలొగ్గలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా అదే సమయంలో బాలీవుడ్ లో వచ్చిన ఒకటి, రెండు చిన్న సినిమాల్లో నటించిన అనంతరం హాలీవుడ్ కి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది. 

 

కాగా క్యాస్టింగ్ కౌచ్ భూతం కేవలం బాలీవుడ్ లోనే కాక హాలీవుడ్ లో కూడా ఉందని అక్కడ జరిగిన ఒక ఘటన ద్వారా తనకు తేటతెల్లమైందని చెప్పింది. అక్కడ ఒక క్యాస్టింగ్ కౌచ్ ఏజంట్ తనవద్దకు వచ్చి, నీకళ్ళ క్రింద చారలు చూస్తుంటే నువ్వు వేశ్యలా ఉన్నావు, అంతేకాక నువ్వు దేవ్ డి అనే సినిమాలో వేశ్యగా నటించవు కదా, మరి నీలాంటి వేశ్యను సినిమా అవకాశం కోసం ఇక్కడికి ఎలా రానిచ్చారు అంటూ అవమానించాడని, అయితే తాను రష్యన్ ని కాదని, అలానే వేశ్యని అంతకంటే కాదని, ఆ సినిమాలో తనకు అటువంటి పాత్రలో నటించే అవకాశం రావడం జరిగిందని చెప్పిందట. ఆ వరుస ఘటనలు తనను మానసికంగా ఎంతో బాధను కలిగించాయని కల్కి కొచ్లిన్ చెప్పుకొచ్చింది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: