వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నైనా గంగూలీతో కలిసి పచ్చిపచ్చిగా డ్యాన్స్ చేసాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ వైరల్ అవుతోంది, దీనిలో ఆర్జీవీ తాజా చిత్రం బ్యూటిఫుల్ లో మహిళా కథానాయికగా నటిస్తున్న నటి నైనా గంగూలీతో కలిసి ఆర్జీవీ స్టెపులేసారు. బ్యూటిఫుల్ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా, దర్శకుడు ఆర్.జి.వి నటి నైనా గంగూలీతో కలిసి డ్యాన్స్ చేశారు. ఆర్జీవీ ఇలా ఒక హీరోయిన్ తో డ్యాన్స్ చేయడం ఇదే మొట్టమొదటిసారి.

 

స్టేజీపై హీరో హీరోయిన్లు డాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా ఆర్జీవీ స్టేజి పైకి వచ్చి హాట్ నైనా గంగూలీతో రాంగోపాల్ వర్మ డాన్స్ చేసి అందరిని షాక్ కు గురిచేసారు. బ్యూటిఫుల్ ఒక రొమాంటిక్ కామెడీ చిత్రం, ఇటీవల సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘ఎ’ సర్టిఫికేట్ పొందింది. బ్యూటిఫుల్ సినిమా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న విడుదలకు సిద్ధమవుతోంది. బ్యూటిఫుల్ సినిమాకు దర్శకత్వం లక్ష్మి ఎన్టీఆర్ ఫేమ్ అగస్త్య మంజు వహిస్తున్నారు, ఈ చిత్రానికి రవిశంకర్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి కెకె బినోజీ డైలాగ్స్ రాసారు.

 

సోషల్ మీడియాలో వైరల్ అయిన బ్యూటిఫుల్ ట్రైలర్‌ను అక్టోబర్ నెలలో రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ బీచ్‌లో రొమాంటిక్ సీన్లు మరియు లిప్ లాక్ లతో ఇంటెన్స్ గా ఉంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పార్త సూరి మరియు నైనా గంగూలీ పోషించారు. ఎ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్‌ కింద టి నరేష్ కుమార్ టి శ్రీధర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్ గోపాల్ వర్మ యొక్క మునుపటి వివాదాస్పద చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయవంతం కాలేదు. మరి ఈ చిత్రమైనా రాంగోపాల్ వర్మకు విజయం తెచ్చిపెడుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: