విక్టరీ వెంకటేశ్ ,యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించిన లేటెస్ట్  మల్టీ స్టారర్ మూవీ వెంకి మామ.  మంచి అంచనాల మధ్య  ఇటీవల విడుదలైన  ఈ చిత్రం మిక్సడ్ రివ్యూస్ ను రాబట్టుకున్నా టాక్  బాగుండడంతో  మొదటి మూడు రోజుల్లో అదిరిపోయే ఓపెనింగ్స్ ను రాబట్టింది. అయితే ఆ తరువాత కొంచెం నెమ్మదించిన  ప్రస్తుతం  బాక్సాఫీస్ వద్ద  డీసెంట్  వసూళ్లను రాబడుతూ బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతుంది.  ఇక ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో వచ్చే ఏడాది  ఫిబ్రవరి 1న విడుదలకానుందని సమాచారం.  
 
జై లవ కుశ  ఫేమ్  బాబీ డైరెక్షన్ లో  పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కిన  ఈ చిత్రంలో  వెంకీ సరసన  హాట్ బ్యూటీ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ నటించగా   నాగ చైతన్య కు  జోడిగా  రాశీ ఖన్నానటించింది.  సురేష్  ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై  సురేష్ బాబు , టిజి విశ్వప్రసాద్  సంయుక్తంగా నిర్మించిన  ఈచిత్రానికి తమన్ సంగీతం అందించాడు. 
 
 
ఇక ఈ చిత్రం తో  వెంకీ , చైతన్య  ఈ ఏడాది  బ్యాక్ టు బ్యాక్  హిట్లు  కొట్టారు. అందులో భాగంగా  ఈసంక్రాంతికి  వెంకీ ,ఎఫ్ 2 తో  ప్రేక్షకులముందుకు  రాగ  ఆ చిత్రం ఆయన  కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టి  ఈ ఏడాది  బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమా  గా  నిలువగా  సమ్మర్ లో మజిలీ తో వచ్చి  సూపర్ హిట్ కొట్టాడు  నాగ చైతన్య.  ఇక ప్రస్తుతం చైతన్య , శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తన 19వ చిత్రంలో నటిస్తుండగా  వెంకీ, శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో అసురన్ రీమేక్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: