ఇటీవల టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరైన యువ దర్శకుడు సతీష్ వేగేశ్న తెరకెక్కించిన శతమానంభవతి, శ్రీనివాస కళ్యాణం సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా ఎంతమంచి వాడవురా అనే సినిమాను తెరకెక్కిస్తున్న సతీష్ వేగేశ్న, ఆ సినిమాపై ఇటీవల తన అభిప్రాయాన్ని ఒక మీడియా ఛానల్ తో పంచుకున్నారు. ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా సంక్రాంతికి పలు భారీ సినిమాల రాక ఆహ్వానించదగ్గ విషయం అని, ఇక ఈ సంక్రాంతికి రాబోతున్న బడా సినిమాలైన దర్బార్, అలవైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంతున్నట్లు తెల్పిన సతీష్ వేగేశ్న, 

 

తమ సినిమాపై తనకు మంచి నమ్మకం ఉందని అన్నారు. శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం మాదిరిగా ఈ సినిమాలో కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని రకాల అంశాలు ఉన్నాయని, అలానే నేటి కాలంలో మనిషిని మనిషే పూర్తిగా దూరం చేసుకుంటున్నాడని, నిజానికి మనిషులు అందరూ మంచివారే, కాకపోతే సెల్ ఫోన్ వంటి పలు సమాచార మాధ్యమాల రాక తరువాత బంధాలు, అనుబంధాలు కరువయ్యాయని అన్నారు. అయితే ఈ సినిమాలో హీరో ఎంతో మంచివాడని, మనుషుల విలువలు, బంధాలు, 

 

అనుబంధాల గొప్పతనం గురించి తెలియజేసేలా అతడి పాత్ర సాగుతుందని అన్నారు. సినిమాలో మంచి కంటెంట్ ఉందని, దానిమీద నమ్మకంతోనే ఆ భారీ సినిమాలతో పాటుగా మా సినిమా కూడా రిలీజ్ చేస్తున్నామని, తప్పకుండా ఆ సినిమాల తోపాటు మా సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకాన్ని సతీష్ వ్యక్తం చేసారు. కళ్యాణ్ రామ్, మెహ్రీన్ జంటగా రూపొందుతున్న ఈ సినిమాను ఆదిత్య మ్యూజిక్ అధినేతలు ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 15న రిలీజ్ కానుంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: