‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ విడుదల చేసిన నాల్గవ పాట ‘బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా’ కూడ విడుదలైన కొన్ని గంటలలోనే ఇన్ స్టంట్ హిట్ గా మారిపోయింది. మెలోడీయస్ మొదలైన ఈ పాటకు మాస్ బీట్ తోడవ్వడంతో యూత్ కు ఈ పాట విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. 

'మల్టీ ఫ్లెక్స్ లోని ఆడియన్స్ మాదిరిగా మౌనంగా వుండడం'...'అద్దం ముందుర నాతో నేనే యుద్దం చేయడం' 'చెంపల్లో చిటికెలు వేసి చక్రవ్తర్తిని చేయడం'...'తుంపర చాలనుకుంటే తుపానే రావడం'..వంటి పద ప్రయోగాలు త్రివిక్రమ్ మార్క్ ను సూచిస్తున్నాయి. ఆర్మాన్ మాలిక్ పాడిన తీరు బాగుండంతో ఒక తెలుగు గాయకుడు పాడినట్లుగా ఈపాట వినేవారికి ఫీల్ కలుగుతోంది. దీనితో ‘అల వైకుంఠపురములో’ సినిమాకి సంబంధించి విడుదలైన నాలుగు పాటలలో మూడు చార్ట్ బస్టర్ హిట్ కావడంతో ఈమూవీ పై మరింత అంచనాలు పెరిగిపోయాయి.  

ఇక ఈ మూవీతో పోటీగా విడుదల అవుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ బుట్ట బొమ్మ పాట యూట్యూబ్ లో సాదిస్తున్న అద్భుతాలను చూసి అదిరిపోతున్నట్లు టాక్. ఇప్పటి వరకు ‘సరిలేరు నీకెవ్వరు’ కు సంబంధించి విడుదలైన ఏ ఒక్క పాట ట్యూన్ కూడ యూత్ కు కనెక్ట్ కాలేదు. 

దీనితో పాటల విషయంలో ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ పై పూర్తి ఆధిక్యత సంపాదించుకున్నట్లు కనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా ఈరోజు నుండి త్రివిక్రమ్ ఈ బుట్ట బొమ్మ పాటను పూజా హెగ్డే లపై అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్ లో ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు చిత్రీకరించ బోతున్నారు. ఈపాట కోసం విదేశాల నుంచి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ప్లాంట్స్ తెప్పించడమే కాకుండా వాటికోసం 40 లక్షలు ఖర్చు చేసారని తెలుస్తోంది. ఈ పాట చిత్రీకరణ ముగిసిన తరువాత ఈ ఖరీదైన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ను ఏమి చేస్తారు అన్న విషయమై కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: