బాలయ్య హీరోగా కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన రూలర్ నెగెటివ్ టాక్ ని తెచ్చుకుంది. పూర్తి పాత కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకి పెద్దగా రుచించలేదు. బాలయ్య సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారందరికీ ఈ సినిమా నిరాశే మిగిల్చింది. ఔట్ డేట్ అయిన కథని పాత తరం దర్శకుడు తీసిన ఈ సినిమా మీద ఎన్నో నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. సినిమా రిలీజ్ కి ముందు బజ్ కూడా ఏర్పడలేదు.

 

సినిమా రిలీజ్ అయ్యాక కూడా పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. అసలే బజ్ లేకుండా వచ్చిన ఈ సినిమాకి థియేటర్లలో జనం కూడా ఉండట్లేదు. మొదటిరోజు కూడా సినిమాకి హౌస్ ఫుల్ పడలేదంటే ఈ సినిమా పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదంతా ఇలా ఉంటే బుక్ మై షో రేటింగ్స్ లో మాత్రం సినిమా పరిస్థితి మరోలా ఉంది.  తొలి రోజు సాయంత్రానికి 90 శాతం రేటింగ్‌తో రూల‌ర్ జ‌నాల‌కు పెద్ద షాకే ఇచ్చింది. 

 

యూజ‌ర్ రివ్యూల‌న్నీ చాలా పాజిటివ్‌గా క‌నిపించాయి. రోజులు గ‌డిచేకొద్దీ రేటింగ్ కొంచెం త‌గ్గింది కానీ.. అయిన‌ప్ప‌టికీ మంగ‌ళ‌వారం నాటికి 77 శాతం రేటింగ్‌తో క‌నిపిస్తోందీ చిత్రం. దాదాపు 20 వేల మంది ఓట్ల ఆధారంగా ఈ రేటింగ్ వ‌చ్చింది. 77 శాతం రేటింగ్ అంటే ఇదో హిట్ సినిమా అనుకోవాలి. హిట్ సినిమాలకే ఇన్ని ఈ మాత్రం రేటింగ్ వస్తుంది. బాలయ్య కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలవబోతున్న ఈ సినిమాకి ఇంతలా రేటింగ్ రావడం ఆశ్చర్యమే.

 

అయితే దీని వెనక కథ వేరేలా ఉంది. బుక్ మై షోలో అంతలా రేటింగ్ రావడానికి కారణం బాలయ్య అభిమానులే. బాలయ్య అభిమానులు తమ హీరో మీద ఉన్న అభిమానంతో ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. పనిగట్టుకుని మరీ సినిమాకి పాజిటివ్ బజ్ తేవాలన్న లక్ష్యంతో వారు ఈ పని చేస్తున్నారు. మరి బాలయ్య అభిమానులా...మజాకా....!

మరింత సమాచారం తెలుసుకోండి: