ఈ మధ్య కాలంలో వరుస హిట్లు కొడుతున్న కుర్ర హీరో ఎవరు అంటే వరుణ్ తేజ్ పేరు కచ్చితంగా ఉంటుంది. మెగా స్టార్ తమ్ముడు నాగబాబు కుమారుడిగా పరిశ్రమకు పరిచయమైన వరుణ్ తేజ్ అతి తక్కువ కాలంలోనే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముకుంద సినిమా తో సినీ తెరంగ్రేటం చేసిన ఈ హీరో ఆ సినిమాతో అనుకున్న స్థాయిలో హిట్ కొట్టకపోయినా మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు.ఇక అప్పటి నుంచి వరస సినిమాలతో బిజీ గా మారిపోయాడు ఈ హీరో. 

 

 ఈ సంవత్సరం సంక్రాంతికి f2 సినిమాతో మన అందరి ముందుకు వచ్చాడు ఈ హీరో. సంక్రాంతికి పెద్ద సినిమాలు వచ్చినా కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత పెద్ద గ్యాప్ తీసుకోకుండానే గద్దలకొండ గణేష్ తో మళ్ళీ థియేటర్ లోకి వచ్చాడు. వరుణ్ తేజ్ నటించిన ఆ సినిమా విడుదల విషయంలో చివరి నిమిషంలో ఎదురైన సమస్యలను తట్టుకుని కూడా మంచి విజయాన్ని సాధించింది.

 

 భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గా సూపర్ హిట్ గా నిలిచింది .సినిమాలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి లాభాలను చేకూర్చింది. మొదట్లో ఫిదా సినిమా ద్వారా భారీ హిట్ సాధించిన ఆ క్రెడిట్ మొత్తం సాయిపల్లవి కొట్టేసింది. నిన్ననే సినిమాల్లో ప్రవేశించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తన ఆనందాన్ని ట్విట్టర్లో పేర్కొన్నాడు వరుణ్ తేజ్.

 

నెక్స్ట్ ఇయర్ కూడా వరుణ్ తేజ్ ఇలాగే మంచి సినిమాలు చేస్తూ తన మార్కెట్ ని మరింత పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.నిర్మాతలకి తమ బడ్జెట్లో సినిమాని పూర్తి చేసి అలాగే మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి అందరూ కూడా ఈ హీరోని ఆదరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: