ఆ విష‌యంలో మెగా స్టార్ చిరంజీవిని.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫాలో అవుతున్నాడు. అస‌లు విష‌యంలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రముఖ సినీనటుడిగా ఆయన మంచి గుర్తింపునే తెచ్చుకున్నారు. అయితే ప‌వ‌న్ రజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని తలచారు. ఈ నేపథ్యంలోనే 2014లో జనసేన పార్టీని స్థాపించారు. రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేపోయిన పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ తిరిగి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్.. అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ రీమేక్‌లో నటించబోతున్నట్టు నిర్మాతలు అఫీషియల్‌గా ప్రకటించాడు. 

 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై 40వ ప్రాజెక్టుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ఎమ్‌సీఏ ఫేం శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే పవన్ ఈ చిత్రం కోసం కేవలం 30 రోజులు మాత్రమే కేటాయించారని తెలుస్తోంది. ‘లాయర్ సాబ్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్.. రూ.50 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. 

 

ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్... క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీకీ పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడ‌ట‌. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం నిర్మించనున్నాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక బందిపోటు దొంగ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాను బాహుబలి, సైరా నరసింహారెడ్డి చిత్రాల్లా.. ప్యాన్ ఇండియా లెవల్లో క్రిష్  తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి బాటలోనే క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.
  

 

మరింత సమాచారం తెలుసుకోండి: