ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన యువ హీరో రాజ్ తరుణ్, ఫస్ట్ సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. వాస్తవానికి తన స్నేహితులతో కలిసి మొదట్లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన రాజ్ తరుణ్, టాలెంట్ ని గుర్తించి అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ, తమ బ్యానర్ పై విరించి వర్మ దర్శకత్వంలో ఉయ్యాల జంపాల ద్వారా అతనికి హీరోగా అవకాశం ఇచ్చింది. ఇక ఆ తరువాత సినిమా చూపిస్త మామ, కుమారి 21 ఎఫ్, ఈడోరకం ఆడోరకం సినిమాలతో కూడా మంచి సక్సెస్ లు అందుకున్న రాజ్ తరుణ్, గత కొద్దికాలంగా సరైన సక్సెస్ లేక సతమతం అవుతున్నాడు. ఇటీవల వరుసగా ఆయన నటిస్తున్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. 

 

ఇక ప్రస్తుతం రాజ్ తరుణ్ నటించిన కొత్త సినిమా ఇద్దరి లోకం ఒక్కటే నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. షాలిని పాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు జీఆర్ కృష్ణ దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ లక్ష్మణ్ నిర్మించిన ఈ ప్రేమకథా చిత్రంపై కూడా ప్రేక్షకుల నుండి ఒకింత నెగటివ్ స్పందన వినపడుతోంది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కొంత గజిబిజిగా సాగుతుందని, ఇక సెకండ్ హాఫ్ కూడా ఆల్మోస్ట్ అలానే సాగుతుందని అంటున్నారు. 

 

ఇకపోతే సినిమాలో రాజ్ తరుణ్ యాక్టింగ్ చూస్తుంటే, అన్ని సీన్స్ కు అతడు ఒక్క‌టే విధమైన ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చినట్లు చెప్తున్నారు. గ‌తంలో  హిట్ సినిమాల‌తో పోలిస్తే ఇటీవల వరుస పరాజయాలతో రాజ్ తరుణ్ యాక్టింగ్ లో జోష్ చాలా వరకు త‌గ్గిపోయిందని, అతడి హ‌వ‌భావాలు కూడా ఎంత మాత్రం బాగోలేదని అంటున్నారు. దీనికి తోడు సినిమా కూడా బోరింగ్‌గా ఉండ‌డంతో ప్రేక్ష‌కుల‌కు మరింత తలనొప్పి తప్పలేదట. కాగా, ఓవర్ అల్ గా చూసుకుంటే, ఇప్పటి పరిస్థితుల్లో మిగతా సినిమాల ధాటికి తట్టుకుని ఈ సినిమా నిలబడే పరిస్థితులు చాలా తక్కువని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: