రామ్ చరణ్ ఇప్పటికే కొణిదల ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ ను పెట్టి చిరంజీవితో ఇప్పటికే రెండు భారీ సినిమాలను తీసాడు. త్వరలో ప్రారంభం కాబోతున్న కొరటాల చిరంజీవిల ప్రాజెక్ట్ కు కూడ రామ్ చరణ్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 

ఇలాంటి పరిస్థితులలో చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ వ్యవహారాలను కూడ వచ్చే సంవత్సరం ప్రారంభం నుండి చూడబోతున్నట్లు టాక్. ఈ బ్యానర్ పై మీడియం రేంజ్ హీరోలతో అదేవిధంగా కొత్త నటీనటులతో కనీసం సంవత్సరానికి రెండు సినిమాలు నిర్మించే విధంగా ప్లాన్ చేయడానికి చరణ్ ఒక స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసి ఆ టీమ్ కు భారీగా జీతాలు కూడ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇదే బ్యానర్ లో అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ద్వితాయార్ధంలో రామ్ చరణ్ పవన్ లతో ఒక మల్టీ స్టారర్ చేసే ఆలోచన కూడ చరణ్ కు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ రాజకీయంగా అనేక విమర్శలు ఎదురుదాడులు ఎదుర్కుంటున్న సందర్భంలో పవన్ తన హోమ్ ప్రొడక్షన్ వ్యవహారాలూ చూసే తీరికా ఏకాగ్రత లేక తన ప్రొడక్షన్ హౌస్ బాద్యతలను కూడ పవన్ కోరిక పై చరణ్ స్వీకరించినట్లు తెలుస్తోంది. 

దీనితో ప్రస్తుతం చరణ్ తాను సినిమాలలో నటిస్తూనే రెండు సంస్థల నిర్మాణ బాధ్యతలను కూడ చూడవలసి వస్తుంది. పవన్ ‘జనసేన’ పార్టీని ముందుకు నడిపించడానికి ఆర్ధిక వనరులు అవసరమైన పరిస్థితులలో పవన్ తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా వచ్చే లాభాలను జనసేన పార్టీ మనుగడ కోసం ఖర్చు చేసే ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా పవన్ ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల విషయంలో జరుగుతున్న నిరసనలను పట్టించుకోకుండా ఇప్పుడు దేశంలోనే లేకుండా రష్యా వెళ్లిపోవడంతో పవన్ వ్యతిరేకులు విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉండటంతో పవన్ వ్యూహాలు ఎవరికీ అర్ధంకాని విషయాలుగా మారాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: