శ్రద్ధా దాస్ గుర్తుందా.. ఎప్పుడో ఆర్య 2 సినిమాలో మిస్టర్ పర్‌ఫెక్ట్ అంటూ పాటలో బన్నీని తన అందాలతో బాగా ఉడికించిందీ అందాల భామ.. ఆ తర్వాత తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా అదృష్టం వరించలేదు. ఆమెను ఏ ఒక్క దర్శకుడు కూడా శ్రద్ధగా పట్టించుకోలేదు. చేసేది లేక పాపం .. ఈ అమ్ముడు బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ జిద్ లాంటి సినిమాల్లో హాట్ హాట్ అందాల ఆరబోసింది.

 

అయినా పెద్దగా ఫలితం దక్కలేదు. ఈ మధ్య పాంథర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలోనూ నాభి అందాలతో అదరగొట్టింది. ప్చ్.. నో యూజ్.. ప్రస్తుతానికి ఈ భామ చేతిలో తెలుగు చిత్రాలు ఏమీ లేవు. అందుకే  కన్నడ- బెంగాలీ భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం `కోటి గొబ్బ 3` అనే చిత్రంలో నటించింది.

 

పెద్దగా సినిమాల్లేవు కదా.. అందుకే టూర్ల మీద టూర్లు వేస్తోంది. తాజాగా… నటి శ్రద్ధాదాస్  ఒంటరి దీవుల విహారంలో ఉంది. ప్రఖ్యాత బాలీ దీవుల్లో బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో వేడెక్కిస్తోంది. విటమిన్ -డి కోసమే ఈ పాకులాట అంటూ ఫ్లోరల్ బికినీ ఫోటోల్ని ట్విట్టర్ లో పోస్టు చేసింది. ప్రకృతి అందాల నడుమ ఉన్న ఓ రిసార్ట్ లో సేదదీరుతున్న శ్రద్ధా ఫోటోలు ఇంటర్ నెట్ ను హీటెక్కిస్తున్నాయి.

 

పెద్దగా సినిమాల్లేకపోయినా.. ఎప్పటికప్పుడు.. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల గుండె కొట్టుకునే వేగాన్ని రెట్టింపు చేస్తోంది.ఇక ఈ లేటెస్ట్ ఫోటోలు కుర్రాళ్లకు పండుగే అని చెప్పాలి. ఆస్ట్రేలియా బాలీ తీరానికి వెళ్లిన ఈ బ్యూటీ... అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. సన్ బాత్ చేస్తూ... డీ విటమిన్ పెంచుకుంటోంది. బాలీ, గిలీ దీవుల్లో వింటర్‌ను ఎంజాయ్ చేస్తున్న శ్రద్ధదాస్... శ్రద్ధగా ఆ ఫొటోల్ని తన ఫ్యాన్స్‌కి షేర్ చేస్తోంది. అసలే చలికాలం.. కుర్రాళ్లు ఈ ఫోటోలు హీటెక్కడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: