పెళ్లి చూపులు సినిమాతో మంచి పేరు తెచ్చుకొని, అర్జున్ రెడ్డి సినిమాతో తిరుగులేని హీరోగా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక సెన్సేషన్. గీత గోవిందం సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుని, డియర్ కామ్రేడ్ చిత్రం ఫర్వాలేదు అనిపించుకుంది, ఇక తన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ తొందరలో విడుదల కానుంది. ఇక ఈ సినిమాతో పాటు పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఫైటర్ చిత్రంలోనూ నటిస్తున్నారు విజయ్ దేవరకొండ.

 

విజయ్ క్రేజ్ కు బాలీవుడ్ యాక్టర్స్ సైతం ఫిదా అయ్యారు. ఈ మధ్య బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్, అలియా భట్ మొదలగు వారితో బీ టౌన్ లో చక్కర్లు కొట్టాడు విజయ్. బాలీవుడ్ లోనూ విజయ్ నటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ విజయ్ మాత్రం ఈ వార్తపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండపై సోషల్ మీడియాలో జోక్స్ పేలుతున్నాయి. 

 

ఒక పింక్ సూట్ ను ధరించి విజయ్ దేవరకొండ ఫోటోకు ఫోజు ఇచ్చారు. ఏంది సామీ ఈ పింక్ సూట్ అంటూ నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు విజయ్ దేవరకొండని, పింక్ సూట్ లో ఉన్న విజయ్ ఫోటోను వివిధ రకాలుగా మీమ్స్ ను క్రియేట్ చేసి నవ్వుల పూలు పూయిస్తున్నారు నెటిజన్లు. విజయ్ నీకు అసలు పింక్ సూట్, సూట్ అవ్వలేదు ఏంటీ ఈ పింక్ సూట్ అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు సినీ జనాలు. అయితే విజయ్పింక్ సూట్ ఏ విషయంపై ధరించారో సమాచారం లేదు. ఈ వింత పింక్ రంగు గల సూట్ ను విజయ్ ధరించడం ఏంటి అని ఇండస్ట్రీ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి. సోషల్ మీడియాలో చాలా చలాకీగా వుండే విజయ్ దేవరకొండ తనపై పేలుతున్న జోక్స్ కు ఎలా స్పందిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: