గత ఏడాది  ప్రారంభంలో ఛలో తో సూపర్  హిట్ కొట్టి న  యంగ్ హీరో నాగ శౌర్య  ఆతరువాత  ఏకంగా  హ్యాట్రిక్  డిజాస్టర్లును ఖాతాలో వేసుకొని  ఇప్పుడు ఎలాగైనా ఒక్క హిట్టు కోసం  ఎదురుచూస్తున్నాడు. అందులో  భాగంగా   వచ్చే  ఏడాది జనవరి 31న  'అశ్వథ్థామ'  అనే చిత్రంతో  తన  అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. నూతన దర్శకుడు రమణ తేజ డైరెక్షన్ లోతెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.  ఈచిత్రంలో శౌర్య  సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు.  తన సొంత బ్యానర్ ఐరా  క్రియేషన్స్ నిర్మిస్తున్నఈ చిత్రం  కోసం శౌర్య చాలా  జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దానికి తగ్గట్లు  సినిమా కూడా బానే వస్తుందట.  ఇక ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన మొదటి సాంగ్  మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా  తాజాగా  ఈ చిత్రం  యొక్క టీజర్  ఈనెల 27న  ఉదయం 11:07 గంటలకు  విడుదలకానుంది.  మరి ఈ చిత్రమైన శౌర్య కు విజయాన్ని ఇస్తుందో చూడాలి.  మెహ్రీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి  చరణ్ పాకాల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.  
 
 
ఇక ఈసినిమా తరువాత తనకు ఊహలు గుస గుస లాడే  లాంటి సూపర్ హిట్ ఇచ్చిన   శ్రీనివాస్ అవసరాలతో  అలాగే నూతన దర్శకురాలు  లక్ష్మి సౌజన్య  డైరెక్షన్ లో   శౌర్య సినిమాలు చేయాల్సివుంది.  అలాగే  ఈ రెండు సినిమాల తోపాటు ఇటీవల   శౌర్య మరో కొత్త చిత్రానికి  కూడా సైన్ చేశాడు నాగశౌర్య.  సుబ్రహ్మణ్యపురం  ఫేమ్   సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్ లో నటించడానికి  నాగశౌర్య  ఓకే చెప్పాడు.ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత  శరత్ మరార్ సంయుక్తం గా ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. మరి ఈ మూడు సినిమాల్లో  ఏ చిత్రాన్ని మొదట సెట్స్ మీదకు తీసుకెళతాడో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: