టాలీవుడ్ లోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన నేచురల్ స్టార్ నాని తర్వాత ‘అష్టాచమ్మ’ మూవీతో హీరోగా మారారు.  ఈ సినిమా మంచి విజయం అందుకుంది. దాంతో నానికి వరుసగా ఛాన్సులు వచ్చాయి. కానీ కెరీర్ బిగినింగ్ లో కష్టాలు ఎదుర్కొన్నారు.  పిల్లజమిందార్ మూవీతో మంచి విజయం అందుకున్న నాని కామెడీ డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ‘భలే భలే మగాడివోయ్’ మూవీతో బాక్సాఫీస్ షేక్ చేశాడు. ఆ మూవీతో కలిసిన వచ్చిన అదృష్టం మాములూగా లేదు..వరుసగా ఆరు సినిమాలు హిట్ కావడంతో నేచురల్ స్టార్ నాని స్టార్ హీరోగా ఎదిగాడు.   వాల్ పోస్ట‌ర్ సినిమా ప్రొడ‌క్ష‌న్ స్థాపించి పూర్తి నిర్మాత‌గా మారాడు.  హీరోగానే కాకుండా నిర్మాణ రంగంలోకి దిగిన నాని ఆ! అనే మూవీ నిర్మించి నిర్మాతగా కూడా విజయాన్ని అందుకున్నాడు.  

 

ఓ వైపు సరైన కథలు ఎంచుకుంటూ హిరోగా సక్సెస్ సాధించిన నాని నిర్మాతగా కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో తాజాగా ఆయ‌న వాల్ పోస్ట‌ర్ సినిమాస్‌పై ఫ‌ల‌క్‌నామ్ దాస్ ఫేమ్ విశ్వ‌క్ సేన్ హీరోగా 'హిట్' అనే సినిమా చేస్తున్నారు . శైలేష్ ఈ మూవీతో ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు.  విశ్వక్ సేను ఇటీవల 'ఫలక్‌నుమా దాస్' స్వియదర్శకత్వంలో తెరకెక్కించి మంచి విజయం అందుకున్నాడు. చిల‌సౌ ఫేమ్ రుహానీ శ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీకి వివేక్ సాగ‌ర్ సంగీతం అందించ‌నున్నారు.

 

ఈ మూవీలో విక్ర‌మ్ రుద్ర‌రాజు సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా క‌నిపించనున్నాడు విశ్వ‌క్ సేన్.  క్రిస్మ‌స్ సంద‌ర్భంగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. అంతే కాదు జ‌న‌వ‌రి 1న మూవీకి సంబంధించిన స‌ర్‌ప్రైజ్ ఉంటుంద‌ని తెలియ‌జేశారు. అయితే ఈ మూవీతో నిర్మాతగా నానికి ఎంత హిట్ అవసరమో.. హీరోగా  విశ్వక్ సేను కి కూడా హిట్ అంతే అవసరంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: