జాన్వీ కపూర్ నటించిన తొలి హారర్ వెబ్ సిరీస్ 'ఘోస్ట్  స్టోరీస్'. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాని నిర్మించింది. కరణ్ జోహార్- దిబాకర్ బెనర్జీ- అనురాగ్ కశ్యప్ తో పాటు జోయా అక్తర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. జోయా అక్తర్ కు సంబంధించిన సెగ్మెంట్ లో జాన్వీ కపూర్ నటించింది. అన్ని విభాగాలకు సంబంధించిన పూర్తి నిడివిగల సినిమాని ఇటీవల ముంబై జుహు లోని ఓ పాపులర్ మల్టీప్లెక్స్ లో ప్రత్యేకం గా ప్రీవ్యూ వేశారు. ఈ ప్రివ్యూకు వైట్ స్కిన్ టైట్ ఔట్ ఫిట్ లో హాజరై  ప్రివ్యూ షో కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. 'లస్ట్  స్టోరీస్ని' చేసిన డైరక్టర్స్ ఈ 'ఘోస్ట్ స్టోరీస్' ని తెరపైకి తీసుకొచ్చారు. 

 

చాలా వైలెంట్ కంటెంట్ తో ఈ సినిమాని రూపొందించారన్నది టాక్. ఈ షో కి కియారా అద్వానీ- సుర్విన్ చావ్లా- మృణాల్ ఠాకూర్- షోభితా దూలిపాళ- సురేఖ సిక్రి- కరణ్ జోహార్- గుల్హన్ దేవయ-జోయా అక్తర్- అనన్య పాండే-దిబాకర్ బెనర్జీ- అనురాగ్ కశ్యప్ తదితరులు హాజరయ్యారు.  అంగరంగా వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో జాన్వీ కపూర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అంతేకాదు అందరి దృష్ఠి జాన్వీ మీదే ఉండేలా ఆసం లుక్ తో అదరగొట్టింది.  

 

ఈ కార్యక్రమానికి వచ్చిన కరణ్ జోహర్ జాన్వీని ఆప్యాయంగా హగ్ చేసుకోవడం పలువురిని ఆకర్షించింది. అంతేకాదు కొంతమంది షాక్ కి గురయ్యారు కూడా. అయితే ఈ దృశ్యాన్ని చూసిన వారంతా శ్రీదేవికి మాటిచ్చాడు. అందుకని అన్నీ దగ్గరుండే చూసుకుంటున్నాడుగా అంటున్నారు బాలీవుడ్ జనం. జాన్వీ కపూర్ కు కరణ్ మెంటర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ కెరీర్ ని పెద్ద స్థాయి లో షేపప్ చేస్తానని మాటిచ్చిన కరణ్ ప్రామిస్ ని నిలబెట్టుకుంటూ ధడక్ సినిమా తో లాంచ్ చేశాడు. ఆ తర్వాత తక్త్ లాంటి భారీ సినిమాలో అవకాశం ఇచ్చాడు. అంతేకాదు పర్సనల్  రికమండేషన్ తో పలు ఆసక్తికర చిత్రాల్లో ఛాన్సులిప్పించాడు. పని లో పని గా నెట్ ఫ్లిక్స్ సిరీస్ ఛాన్స్ కి కారకుడై హైప్ పెంచేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: