అర్జున్ రెడ్డి ద్వారా సెన్సేషన్ హీరో గా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ.. ఈయన ఒక్క సినిమాతో బాగా పాపులర్ ఈ హీరో ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోఈవెంట్ కు వెళ్ళినా కూడా కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారన్న విషయం తెలిసిందే.. 

 

సినిమాలే కాకుండా ఫ్యాన్స్ తో ఎప్పుడు బిజీగా ఉండే విజయ్ ఒకానొక సందర్భంలో అందిరి కోరిక తీరుస్తానని అన్నారు.. తన మంచి మనసును చాటుకోవాలని అనుకుంటున్నాడు. క్రిస్మస్ సందర్భంగా సాంటా క్లాజ్ అవతారం ఎత్తారు. ఈసారి ఫ్యాన్స్‌కి బంపరాఫర్ ఇచ్చారు. ఫ్యాన్స్ ఏం కోరుకుంటే అది ఇస్తానంటూ హామీ ఇచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా 2017, 2018 సమయంలో క్రిస్మస్‌కి ఏం చేశాడో వివరిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. 2017, 2018లో విజయ్ ఫ్యాన్స్‌ని కలిసి వారికి కొన్ని కానుకలు ఇచ్చారు. అయితే ఈసారి మాత్రం కాస్త కొత్తగా చేయాలని విజయ్ ఫ్యాన్స్ నీ కోరారు..

 

మామూలుగానే విజయ్ కి సినిమా అభిమానుల కన్న కూడా బయట అభిమానులే ఎక్కువగా ఉన్నారు.  దానికి కారణం కూడా లేకపోలేదు.. ఏ హీరో సినిమా విడుదల అయిన కూడా హంగామా చేయడం విజయ్ కి కొత్తేమీ కాదు.. అలా ఉన్న విజయ్ ప్రతి క్రిస్మస్ పండుగకు కానుకలు ఇచ్చేవాడు.. అది కూడా తనకు ఇష్టమైన కానుకలు ఇస్తూ వస్తున్నాడు..


ఇప్పుడు కొంచెం మార్చారు.. అభిమానులకు ఎది కావాలనుకున్న కూడా తీరుస్తానని అంటున్నాడు.. దానికోసమే... మీకేం కావాలో మీరే చెప్పండి. ట్విటర్‌లో దేవరసాంటా అన్న హ్యాష్‌ట్యాగ్‌తో మీకేం కావాలో పంపండి. కనీసం తొమ్మది, పది మందికి సాయం చేస్తాను. ఆ తర్వాత ఎంత వీలైతే అంతమందికి సాయం చేస్తాను’ అని పేర్కొన్నారు. అయితే ఈ వీడియో చూడగానే ఫ్యాన్స్‌కు ఎక్కడ లేని వింత ఆలోచనలు వచ్చాయి. ఈ విధంగా విజయ్ చేయడంతో కొంతమంది కామెంట్లు కూడా పెడుతున్నారు.. ప్రస్తుతం విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో ఫైటర్ సినిమాలో నటిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: