ప్రస్తుతం రోజూలు గడుస్తున్నకొద్దీ మన భూమిపై కాలుష్య రక్కసి పెరుగుతూ ఉండడంతో పాటు దానివలన మానవావళి పలు రకాల శ్వాస కోశ వ్యాధుల బారిన పడుతూ ప్రాణాలు విడుస్తున్నారు. దానితో పాటు ఈ పర్యావరణ కాలుష్యం వలన కొన్ని రకాల ప్రాణులు కూడా అంతంరించిపోతున్నాయని ఎప్పటినుండో పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే కొన్నాళ్లుగా ఈ పరిస్థితికి అడ్డు కట్ట వేసి, ప్రతిఒక్కరం తమ వంతుగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కొందరు ప్రముఖులు. 

 

అందులో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ పేరుతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి విశేషంగా స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఆయన విసిరిన ఛాలెంజ్ కు పలువురు ప్రముఖులు మొక్కలు నాటి తమవంతుగా సాయమందించగా, నేడు యాంకర్ కం సింగరైన మంగ్లీ, మణికొండలోని జీహెచ్ఎంసీ పార్క్ లో మూడు మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, సంతోష్ అన్న ప్రారంభించిన ఈ గ్రీన్ ఛాలెంజ్ వలన ఇప్పటివరకు ఎందరో వ్యక్తులు తమ వంతుగా విశ్వాన్ని రక్షించాలనే బాధ్యతతో మొక్కలు నాటారని, 

 

ఇక నేడు తనకు ఈ గొప్ప అవకాశం వచ్చినందుకు తాను ఎంతో సంతోషిస్తున్నానని అంటోంది. అంతేకాక తన చిన్నప్పుడు పెద్దవాళ్ళు చక్కగా సాయంత్రం అయ్యేసరికి ఇంటి వద్ద ఉండే చెట్ల దగ్గరకు వచ్చి కూర్చుని అందరితో కలిసి హాయిగా కబుర్లు చెపుతూ సేద తీరేవారని, అయితే నేడు రాను రాను చెట్లు అంతరించిపోవడం వలన ఆ విధమైన పరిస్థితులే పూర్తిగా కనుమరుగయ్యని చెప్పుకొచ్చింది. ఇక ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా తన తరపున జబర్దస్త్ సుడిగాలి సుధీర్ కు యాంకర్ శ్రీముఖికి, అలానే జార్జి రెడ్డి హీరో సందీప్ మాధవ్ లకు మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరింది మంగ్లీ .....!!

మరింత సమాచారం తెలుసుకోండి: