తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది అక్కినేని వారి కోడలు సమంత. 'ఏమాయ చేశావే' సినిమాతో కుర్రకారుని తనదైన మాయలో పడేసింది ఈ బ్యూటి. అంతేకాదు తెలుగులో ఆమెతో నటించిన మొదటి హీరో నాగ చైతన్యనే పెళ్లిచేసుకుంది సమంత.  అనతి కాలంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతో కలిసి నటించింది. పెళ్లి త‌ర్వాత కూడా వరుస విజయాలు దక్కించుకుంటున్న దూసుకుపోతోంది స‌మంత‌. పైగా పెళ్లి తర్వాత కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్ని ఎంచుకుంటుంది సమంత. 

 

ఇదిలా ఉంటే..  2018లో రంగస్థలం, మహానటి, యూ టర్న్, అభిమన్యుడు వంటి మంచి సినిమాలు చేసింది సమంత. ఈ సినిమాలన్నింటిలోనూ సమంత పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. ముఖ్యంగా రంగస్థలంలో రామలక్ష్మి పాత్ర అయితే అద్బుతమే. ఇక మహానటిలో మధురవాణి కూడా మంచి పాత్రే. ఈ రెండు సినిమాలకు తాజాగా ఏకంగా 9 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయి. వీటిలో సమంత పాత్ర కూడా బాగానే ఉన్నా కూడా కనీసం ఒక్క అవార్డు కూడా సమంతక రాలేదు. దాంతో పాటు మిగిలిన సినిమాలు కూడా అవార్డులకు నోచుకోలేదు. 

 

ఒకే ఏడాది అన్ని సినిమాలు చేసినా కూడా కనీసం ఒక్క సినిమాలో కూడా అవార్డు నటన చేయలేదా అంటూ ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే యూ టర్న్, సూపర్ డీలక్స్ లాంటి సినిమాల్లో కూడా స్యామ్ నటనకు మంచి స్పందన వచ్చింది. అయినా కూడా ఒక్క అవార్డు కూడా రాలేదు. ఈ విషయంలో సమంత కూడా హర్ట్ అయిన‌ట్టు తెలుస్తోంది. కాగా, సమంత ‘96' తెలుగు రీమేక్‌లో నటించిన విషయం తెలిసిందే. ఇందులో టాలీవుడ్ శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. మాత‌ృకను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగులోనూ రూపొందిస్తున్నారు. దీన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: