నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం రూలర్ .. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. వీరి కాంబినేషన్లో ఇది రెండో సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. గత శుక్రవారం (డిసెంబర్ 20)న మూడు సినిమాలకి పోటిగా విడుదలైంది. మొదటిరోజు ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్‌ టాక్ వచ్చింది.ఈ సినిమాని అందరూ మంచి పవర్ ప్యాక్డ్ ఆక్షన్ ఎంటర్ టైనర్ ఆశించారు కానీ సినిమా మాత్రం అందరినీ నిరాశ పరిచింది. దాంతో ఈ సినిమాకి ఓపెనింగ్స్ కరువయ్యాయి.

 

బాలయ్యకి ఉన్న మాస్ ఫాలోయింగ్ వలన మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టుకున్నప్పటికీ రెండవ రోజు నుంచీ పూర్తిగా డీలా పడిపోయింది. కానీ యాసిడ్ టెస్ట్ లాంటి సోమవారం రోజున ఈ సినిమా కంప్లీట్ గా ఫెయిల్ అయ్యింది. సోమవారం కేవలం 40 లక్షలు మాత్రమే చేసింది. ఆంధ్ర – తెలంగాణాలో 21.5 కోట్లకి అమ్ముడు పోయిన రూలర్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కి సుమారు 15 కోట్ల భారీగా నష్టాన్ని చవి చూడనున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

 

‘రూలర్’ 4 డేస్ ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:

నైజాం – 1.46 కోట్లు
సీడెడ్ – 1.73 కోట్లు
గుంటూరు – 1.51 కోట్లు
ఉత్తరాంధ్ర – 68 లక్షలు
తూర్పు గోదావరి – 44 లక్షలు
పశ్చిమ గోదావరి – 36.5 లక్షలు
కృష్ణా – 34.5 లక్షలు
నెల్లూరు – 33 లక్షలు

4 డేస్ మొత్తం షేర్ – 6.86కోట్లు

 

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాని మొదలుపెట్టాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో పట్టాలేక్కనుంది. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వీరి కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కేథరిన్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: