కెరియర్ మొదట్లో సూపర్ సక్సెస్ లను అందుకున్న యువ హీరో రాజ్ తరుణ్ ఈమధ్య వరుస ఫ్లాపులు చేశాడు. దిల్ రాజు బ్యానర్ లో రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన సినిమా ఇద్దరిలోకం ఒకటే. ఈ సినిమాలో షాలిని పాండే హీరోయిన్ గా నటించింది. జి.ఆర్ కృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

 

కథ :

 

చిన్నప్పటి నుండి హీరోయిన్ అవ్వాలని కలలు కనే వర్ష (షాలిని పాండే). తన బోయ్ ఫ్రెండ్ తప్ప ఆమెని ఎవరు నమ్మరు అయితే అలాంటి టైంలో ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ మహి (రాజ్ తరుణ్) వర్ష ఫోటో తీయగా దానితో వర్షకు హీరోయిన్ గా ఛాన్స్ వస్తుంది. అలాంటి టైంలో వర్ష, మహిల మధ్య క్లోజ్ నెస్ పెరుగుతుంది. మహి వర్షని ప్రేమిస్తాడు..? వర్ష కూడా మహిని ఇష్టపడుతుంది..? మరి వీళ్లిద్దరి కథ ఎలా ముగిసింది అన్నది సినిమా కథ.

 

విశ్లేషణ :

 

ఇద్దరిలోకం ఒకటే.. జి.ఆర్ కృష్ణ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా రొటీన్ స్టోరీ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారని చెప్పొచ్చు. సినిమాలో ఏమాత్రం కొత్తదనం కనిపించదు. అంతేకాదు సినిమా అంతా కొన్ని సినిమాలోని సీన్స్ అన్ని కలిపి చేసినట్టుగా ఉంటుంది. అక్కడక్కడ మళ్లీ రావా సినిమా పోలికలు కనిపిస్తాయి. హీరో హీరోయిన్స్ ఇద్దరు చిన్నప్పుడే పరిచయం ఉండటం లాంటి కథలు చాలా వచ్చాయి.

 

సినిమా కథ పాతదే కనీసం కథనం అయినా కొత్తగా ఉంటుందేమో అనుకుంటే స్క్రీన్ ప్లే కూడా పరమ బోరింగ్ గా అనిపిస్తుంది. రాజ్ తరుణ్ అసలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేడు. సినిమా అంతా మూస థోరణిలో వెళ్తుంది. యూత్ ఆడియెన్స్ కు నచ్చే అంశాలు పెట్టే అవకాశం ఉన్నా సినిమా మెప్పించలేదు.

 

రాజ్ తరుణ్, షాలిని పాండే పెయిర్ కూడా ఇంప్రెసివ్ గా లేదు. దర్శకుడు ఈ కథను ఎక్కడినుండో ఇన్ స్పైర్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. అయితే అంతగా కథలో ఏం లేదని చెప్పొచ్చు. ముందుగా షోలు వేసి నిర్మాత దిల్ రాజు వేసిన ప్లాన్స్ అన్ని వర్క్ అవుట్ కాలేదని చెప్పొచ్చు. 

 

నటీనటుల ప్రతిభ : 

 

రాజ్ తరుణ్ ఈ సినిమాలో ఎందుకో డల్ గా కనిపించాడు. సినిమాలో అతని నటన నీరసంగా ఉంది. అన్ని ఎమోషన్స్ కు ఒకే ఎక్స్ ప్రెషన్ అన్నట్టుగా రాజ్ తరుణ్ నటన ఉంది. ఇక సినిమాలో కాస్త కూస్తో చెప్పుకునే ప్లస్ పాయింట్ ఉంది అంటే అది షాలిని పాండే అని చెప్పొచ్చు. సినిమాలో సిజ్జు, భరత్, రోహిణి లాంటి నటులంతా పరిధి మేరకు నటించి మెప్పించారు.

 

విశ్లేషణ :

 

సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే సినిమాలో విషయం లేకపోవడంతో కెమెరా వర్క్ ఇంప్రెస్ చేయలేదు. మిక్కి జే మేయర్ మ్యూజిక్ కూడా పెద్దగ ఆకట్టుకోలేదు. సినిమా కథ, కథనాల్లో దర్శకుడు జి.ఆర్.కృష్ణ రొటీన్ గా నడిపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు.

 

ప్లస్ పాయింట్స్ :

 

షాలిని పాండే

కెమెరా వర్క్

మైనస్ పాయింట్స్ :

 

స్టోరీ

స్క్రీన్ ప్లే

ఎడిటింగ్

బాటం లైన్ :

ఇద్దరిలోకం ఒకటే.. రాజ్ తరుణ్ బ్యాడ్ లక్..!

 

రేటింగ్ : 1.5/5

 

మరింత సమాచారం తెలుసుకోండి: