టాలీవుడ్ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా, పూజా హెగ్దే కథానాయికగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో. భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మ‌రియు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జనవరి 12న విడుదల కానుంది. 

 

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్‌, టీజర్‌, పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇవి మాత్ర‌మే కాదు.. ఈ సినిమాలో మ‌రెన్నో హైలైట్స్ ఉన్నాయ‌ట‌. ముఖ్యంగా ఈ సినిమాలో తమిళ నటుడు సముద్రకని ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర టీజ‌ర్‌లో సముద్రకని- అల్లు అర్జున్ ఎదురుపడే సీన్ భ‌లేగా పేలింది. కానీ.. ఇది జస్ట్ శాంపిలేనట. సినిమాలో సముద్రకని-అల్లు అర్జున్ మధ్య ఇలాంటి కాంబినేషన్ సీన్స్ చాలానే ఉన్నాయట. ఎంతో సీరియస్ యాక్షన్ సీన్లు అయినప్పటికీ అల్లు అర్జున్ ఇచ్చే కౌంటర్లు ఫుల్ కామెడీని పండిస్తూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటార‌ట‌.

 

ఈ సీన్స్ సినిమాలో హైలైట్ గా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. కాగా, అల వైకుంఠపురములో సినిమాలో సుశాంత్‌, ట‌బు, నివేదా పేతురాజ్స్‌ నవదీవ్‌, సునీల్‌, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్స్ రికార్డులు బద్దలు కొట్టాయి. థమన్ బాణీలు క్లాస్, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాయి. దీంతో అల.. వైకుంఠపురములో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: