భారతదేశ సినీ పరిశ్రమలో బాలీవుడ్ ని మినహాయిస్తే రీజనల్ లాంగ్వేజస్ లో టాలీవుడ్ హీరోల అందంతో మరొకరిని పోల్చలేం. గ్లామర్ అనే పాయింట్ చుట్టూనే తెలుగు సినిమాలు తిరుగుతూంటాయనే సంగతి తెలిసిందే. అటువంటి అందంతో ఈ మధ్య దూసుకొచ్చిన మరో హీరో విజయ్ దేవరకొండ అనే చెప్పాలి. యూత్ ని అట్రాక్ట్ చేయడంలో రీసెంట్ టైమ్స్ విజయ్ ను కొట్టిన వారు లేరు. ఈ అందమే ఇప్పుడు ఓ బాలీవుడ్ అప్ కమింగ్ సెన్సేషన్ హీరోయిన్ ను ఆకట్టుకుంది.

 

 

అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ మన విజయ్ దేవరకొండపై పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు విజయ్ దేవరకొండపై క్రష్ ఉందని చెప్తోంది. ఓ టీవీ చానెల్ బాలీవుడ్ నటి నేహా థూపియా నిర్వహించే  ‘నో ఫిల్టర్ నేహా’ కార్యక్రమంలో పాల్గొన్న జాన్వీ ఈ విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పింది. ఈ విషయంపై అనేకసార్లు, అనేక ఇంటర్వ్యూల్లో ఫీలర్స్ వదిలానని కూడా చెప్పింది. గత ఇంటర్వ్యూల్లో కూడా విజయ్ దేవరకొండ సినిమా గీత గోవిందం సినిమాలోని ‘ఇంకేం.. ఇంకేం.. కావాలే..’ పాట తనకెంతో ఇష్టమని చెప్పిన విషయం తెలిసిందే. మళ్లీ ఇదే విషయాన్ని రిపీట్ చేయడంతో జాన్వీ మాటలు మరింత హైలైట్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

 

 

విజయ్ దేవరకొండ క్రేజ్ సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్ కి కూడా పాకింది. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ లో నటించనప్పటికీ ఆ సినిమా ఒరిజనల్ వెర్షన్ హీరోగా మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం విజయ్ ఫైటర్ అనే సినిమా పూరి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వీనే హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తోంది. దీనిపై అఫిషియల్ కన్మఫర్మేషన్ వస్తే విజయ్ అభిమానులకు ఆనందానికి అవధులు ఉండవు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: