టాలీవుడ్ లో ఇప్పటి వరకు అరడజను పైగా మెగా హీరోలు వచ్చారు.  మెగాస్టార్ చిరంజీవి తర్వాత మాస్ ఇమేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సంపాదించాడు.  శంకర్ దాదా జిందాబాద్ మూవీ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోవడం పవన్ బాగా కలిసి వచ్చింది.  ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ లు హీరోలుగా పరిచయం అయ్యారు.  ఈ ఇద్దరు హీరోలు తమ డ్యాన్స్, ఫైట్స్ తో మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.  ఇక మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ మూవీస్ తో బాగా అలరించాడు.  ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చాయి.  దాంతో కెరీర్ కష్టాల్లో పడ్డట్టే అనుకున్న సమయంలో మామ సలహా మేరకు కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

 

ఈ నేపథ్యంలో వచ్చిన మూవీనే చిత్రలహరి.   ఈ ఏడాది చిత్రలహరితో మంచి విజయం అందుకున్న సాయిధరమ్ తేజ్ వెంటనే మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ మూవీతో మరో విజయం అందుకున్నాడు.  ఇక మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ‘ముకుందా’ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కంచె మూవీతో మంచి విజయం అందుకున్నాడు.  ఈ సంవత్సరం  సంక్రాంతి కానుకగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్, వెంకటేశ్ నటించిన ఎఫ్ 2 మూవీ సూపర్ హిట్ అయ్యింది. 

 

మూవీ అంచనాలు మించి కలెక్షన్లు వసూళ్లు చేసింది.  ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ (వాల్మీకి) మూవీ మరో విజయం అందుకుంది.  ఈ మూవీలో వరుణ్ పూర్తిగా డిఫరెంట్ రోల్ లో నటించారు. మొత్తానికి ఈ ఏడాది ఇదరు యంగ్ మెగా హీరోలకు అదృష్టం భలే కలిసి వచ్చింది.  మరి ముందు ముందు ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని సినిమాలు తీస్తే కొంత కాలం కెరీర్ ఏ ఇబ్బంది ఉండదని అంటున్నారు మెగా ఫ్యాన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: