ఇలియానా ఒకప్పుడు తన అందచందాలతో ప్రేక్షకుల మనసును దోచుకుంది. టాలివుడ్ లో తన కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న టైం లో బాలివుడ్ కి వెళ్లిపోయింది. అయితే ప్రస్తుతం ఇలియానాకి బాలివుడ్ లో మంచి అవకాశాలు దక్కడంలేదు. ఇక టాలివుడ్ లో నిర్మాతలు ఇలియానాని మార్చిపోయారనే చెప్పుకోవాలి. 

 

ప్రజంట్ ఇలియానా  బాలివుడ్ లో అరకొర ఆఫర్స్ తో కెరియర్ ను నెట్టకొస్తుంది. చివరగా పాగల్ పంతి చిత్రంలో నట్టించింది. అయితే తాజాగా ఇలియానా మరో ఆఫర్ దక్కించుకున్నట్లు టాక్ వినిపినిపిస్తుంది.  గతేడాది అజయ్ దేవ్ గన్ తో నటించిన రైడ్ సినిమా మంచి విజయం సాధించింది. 

 

అయితే ఈ రైడ్ సినిమా సీక్వల్ ను తెరకెక్కించాలని అజయ్ దేవగన్  ఫిక్స్ అయ్యారట. రైడ్ సినిమాలో అజయ్ దేవ్ గన్ ఇలియానా మద్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్  అయినందున ఈసినిమాలో కూడా ఇలియాననే హీరోయిన్ గా తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇలియానాని సంప్రదించినట్లు టాక్ కూడా వినిపిస్తుంది. 

 

గతేడాది రాజ్ కుమార్ గప్త దర్శకత్వంలో తెరకెక్కిన రైడ్ సినిమా హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ సీక్వల్ కి ఆయనే దర్శత్వం వహిస్తారా లేదా మరింకెవరైనా డైరెక్ట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.  ఏదిఏమైనా ఇలియానాకు ఈ ఆఫర్ ఫైనల్ అయితే బాలివుడ్ లో మరిన్ని ఆఫర్లు దక్కే అవకాశం కనిపిస్తుంది. 

 

ఇలియానా చాలా గ్యాప్ తరువాత టాలివుడ్ లో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంధోని సినిమాతో ప్రేక్షకులను అలరించింది. కాని ఈ సినిమా ప్లాప్ లిస్ట్ లో చేరింది. దీంతో ఇలియానాకి టాలివుడ్ లో ఆఫర్స్ కరువయ్యాయనె చెప్పొచ్చు. ప్రస్తుతం ఇలియానా ఈ ఆఫర్ తో బాలివుడ్ లో సెటిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ నిర్ణయం మాత్రం సినిమా సక్సెస్ , ఫేల్యూర్ పై ఆధారపడి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: