రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరే ఓ సంచనం. వర్మ ఏంచేసినా.. అసలు ఏం చేయకుండా  కాం గా ఉన్న సంచలనమె. ఈ సంత్సరం రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలు 'లక్ష్మీస్ ఎన్ టిఆర్'  'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'  సినిమాలు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. బ్యూటి ఫుల్ ఆడియో ఫక్షన్ లో డ్యాన్స్ చేసి వర్మలో దాగి ఉన్న మరో కళని బయటపెట్టాడు. 

 

బ్యూటిఫుల్ ఆడియో రిలీజ్ వేడుకలో నెటిజన్స్ అడిన ప్రశ్నలకు వర్మ ఘాటు సమాదానాలే ఇచ్చారు. మీ బయోపిక్ నెగటివ్ గా తీస్తే మీ సమాధానం ఏంటి అడిగాడు ఓ నెటిజన్. దానికి సమాదానంగా వర్మ ఇప్పటి వరకు నేను తీసిన బయోపిక్ లు చంద్రబాబును అడిగి తీయలేదు, ఎన్టీ ఆర్ ని అడిగలేదు,  లక్ష్మీ పార్వతి పర్మీషన్ తీసుకొని చేయలేదు. అలా జరిగింది కాబట్టే ఆ బయోపిక్ అలాగె తీసాను. అలాగె నా బయోపిక్ కూడా నన్ను అడకుండా తీయండటూ సమాదానం ఇచ్చారు. 

 

మీకు శ్రీదేవి బయోపిక్ తీసే ఉద్దేష్యం ఏమైనా ఉందా అని మరో నెటిజిన్ అడిగిన ప్రశ్నకు ఖచ్చితమైన సమాదానం ఇచ్చారు ఆర్జీవి. శ్రీదేవి బయోపిక్ తీసే ఉద్దేశ్యం అసలు లేదని, ఆమె క్యారెక్టర్ చేయాలంటే ఆమె లాంటి అమ్మాయి దొరకడం అసాద్యం అన్నారు. 

 

సినిమాలకు , సమాజానికి మీరు ఎప్పుడు దూరంగా ఉంటారు అని అడిగిన మరో నెట్టిజన్ అజిగి ప్రశ్నకు వర్మ దిమ్మతిరిగిపోయే సమాదానం ఇచ్చారు. నువ్వు చచ్చినపుడు నేను నువ్వు చెప్పినట్లుగా  సినిమాలకు సమాజానికి దూరంగా ఉంటానని జవాబిచ్చారు. జీవితంలో మనల్ని ముందుకు తీసుకెళ్ళే రెండు అంశాలు, అమ్మాయి గ్లామర్, మగాడి పవర్ అని మరో ప్రశ్నకు జవాబు ఇచ్చారు. 

 

నెటిజన్ అడిగిన చివరి ప్రశ్న.. మీరు గంటలో చనిపోతారు అని తెలిస్తే ఎం చేస్తారు. శ్రీదేవి సమాది ఎక్కడ ఉందో తెలుసుకుని ఆ సమాది పక్కనే ఖాళీ స్థలం ఉండేల చూసుకుంటానని అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: