నాచురల్ స్టార్ నాని తన నటనతో ప్రేక్షల మనసును ఇట్టే దోచుకుంటాడు. అయితే నాని హీరోగానే కాదు నిర్మాతగా కూడా మనందరికీ తెలిసిన విషయమే. 'అ' అనే సినిమాతో నాని నిర్మాతగా మారాడు. డిఫరెంట్ కథతో ఈ సినిమా ప్రేక్షలను మైమరపిచనుందనుకున్నారు. కాని ఈ సినిమా కలెక్షన్స్ పరంగా సక్సెస్ అవలేదు కాని జాతీయ అర్డులు మాత్రం సొంతం చేసుకోగలిగింది. 

 

ఇప్పుడు నాని 'అ' స్పూర్తితో మరో సినిమాను తెరకెక్కించ నున్నాడు. 'ఫలక్ నుమా దాస్'  సినిమాతో పాపులర్ అయిన కుర్ర హీరో విశ్వక్ సేన్ తో నానిసినిమా తీయబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చింది. క్రిస్మస్ సంధర్భంగా నాని తన కొత్త సినిమా టైటిట్ పోస్టర్ ని అభిమానులతో పంచుకున్నాడు. 

 

నాని నిర్మిస్తున్న ఈ సినిమాకి 'హిట్' అనె టైటిల్ కూడా డిసైడ్ చేసారు. పేరులో ఉన్న హిట్టు, బాక్సాఫీస్ దగ్గర కూడా వినిపించే టాక్‌లోనూ ఉంటుందో లేదో వేచి చూడాలి.  సినిమాలో విశ్వక్ సేన్ రుద్రరాజు అనే పాత్రలో నటించనున్నాడు. 'డిఫరెంట్ సినిమాలను నేను మాత్రమే హ్యాండిల్ చేయగలను' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు నాని. తన సినిమాకు సంభందించిన ముచ్చట్లను అభిమానుతో పంచుకున్నాడు. న్యూఇయర్ రోజున ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను అభిమానులతో షేర్ చేసుకోబోతున్నట్లు నాని ప్రకటించారు.

 

ఈ సినిమాలో విశ్వక్ సేన్  కి జంటగా 'చిలసౌ' ఫేం రుహానీ శర్మ నటింనుంది. పోస్టర్ లో విశ్వక్ లుక్ డిఫరెంట్ గా ఉంది. మరి సినిమాలో ఎంలాటి పర్ఫామెన్స్ ఉంటుందో వెండి తెరపై చూడాల్సిందే. నాని, విశ్వక్ సేన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎంత వరకు హిట్ అవుతుందో వేచి చూడాల్సిందే.  మరోపక్క నాని ‘v’ సినిమాతో బిజీగా ఉన్నారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు మరో హీరోగా నటిస్తున్నారు. నివేదా థామస్, అదితి రావు హైదరి కథానాయికలుగా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: