తెలుగు సినీ ఇండస్ట్రీ హిట్లు, ప్లాప్, డిజాస్టర్స్ తో 2019వ సంవత్సరం మరో ఐదు రోజుల్లో ముగియనుంది. బ్రోచేవారెవరురా, సాయి శ్రీనివాస ఆత్రేయ, జెర్సీ లాంటి డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకులకు అందిచిన ఈ సంత్సరం భారీ డిజాస్టర్స్ ని కూడా అందిచింది. ఈ సంవత్సరం నిర్మాతలను నట్టేట ముంటిన సినిమాల లిస్ట్ పై ఓ లుక్కెద్దాం..

 

బోయపాటి దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్టెట్ సినిమా వినయ విధేయరామ. రిలీజ్ కి ముందే ఈ సినిమా ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది. కాని రిలీజ్ తరువాత మాస్ పేరుతో బోయపాటి తీసిన ఈసిమా వరెస్ట్ సినిమా తీసాడని తెలింది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన ఒంటి పై పచ్చబొట్లు కూడా వేయించున్నాడు. కాని సినిమా మాత్రం బాక్స్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. 

 

ఇక డిజాస్టర్స్ లైన్ లో ఉన్న మరో సినిమా మన్మధుడు-2. నాగార్జున కెరియర్ మన్మధుడు సూపర్ హిట్ సినిమా. అయితే ఈ సినిమాకు సీక్వల్ గా తెరకెక్కిన ఈ సినిమా మాత్రం నాగార్జున కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిపోయింది. సినిమా ట్రైలర్ ఉన్న ఎక్సైట్ మెంట్ సినిమాలో లేదని ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. సినిమాలోని వల్గర్ కామెడీ, బోరింగ్ స్క్రీన్ ప్లే, చెత్త రొమాన్స్ ఈ సినిమాను 2019 వరెస్ట్ చిత్రాల లిస్ట్ లో చేర్చింది. 

 

మరో సినిమా బాలయ్య కధానాయకుడు, రూలర్ సినిమా కూడా బాక్స్ వద్ద బోల్తా పడ్డాయి. ఈ రెండు సినిమాలు బాలయ్య కెరియర్ లో భారీ డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. కధానాయకుడు సినిమాలో బాలయ్య నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది కాని.. క్రిష్ దర్శకత్వం .. ఆసక్తిలేని స్క్రీన్ ప్లే తెలుగుదేశం వీరాభీమాను కూడా తృప్తి పరచలేకపోయింది. ఇక కొద్ది రోజుల క్రితం కమర్షయల్ హంగులతో రిలీజ్ అయిన రూలర్ సినిమా కూడా స్టోరీ పరంగా ప్లాప్ నే మిగిల్చింది. కోట్లు ఖర్చు పెట్టిన ఈసినమా మాత్రం భారీ డిజాస్టర్ నే మిగిల్చింది. 

 

ఇక ప్రభాస్ ఖాతాలో ఈ సంవత్సరం మరో డిజాస్టర్. ప్రభాస్ బాహుబలితో ఫ్యాన్స్ లిస్ట్ పెంచుకున్నాడు. దీంతో ప్రబాస్ నెక్ట్స్ సినిమాకోసం ఎంతో ఆతుత్రగా ఎదరు చూసిన ఫ్యాన్స్ కిమాత్రం సాహో సినిమా నిరాశే మిగిల్చింది. అభిమానులకు థియోటర్ లో బోర్ కొట్టించింది. 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కు లాస్ ప్రాజెక్ట్ గా మిలిగింది. 

ఇలా పెద్ద సిమాలేకాదు డిజాస్టర్స్ లిస్ట్ లో చిన్న సిమాలు కూడా ఉన్నాయి. ఆర్డీ ఎక్స్ లవ్, హిప్పీ, చాణక్య, ఆవిరి, అమ్మరాజ్యంలో కమ్మ బిడ్డలు, ప్రేమకథాచిత్రం-2, సీత, బీచ్ రోడ్ చేతన్ ఇలా.. చెప్పుకుంటూ పోతే బాక్సావద్ద బోల్తా పడ్డ సినిమాలు చాలా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: