మామూలు గా హీరోయిన్లు తాము బాగా నటించగలమని అనుకోవడాని కి పెద్ద హీరోల తో సినిమాలు చేయాలని అనుకుంటారు.. అలా చేస్తేనే వారు బెటర్ యాక్టర్ అని నిరూపించుకుంటారు..అందుకే చాలా మంది పెద్ద హీరోల పక్కన చిన్న క్యారక్టర్ ఛాన్స్ వచ్చినా కూడా నటించడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు.  అందుకే చిన్న సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు...


ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు అలానే ఆలోచిస్తున్నారు. కొంతమంది సక్సెస్ అవుతున్నారు. మరి కొందరు మాత్రం వెనుతిరుగుతు న్నారు.. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ నటించింది.. ఆ సినిమా ప్లాప్ అవ్వడం తో మళ్లీ సినిమా అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు చాలా మంది యువ హిరొలకన్నా పెద్ద హీరోల సరసన నటించడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు..


 కమర్షియల్‌ హీరోయిన్‌గా ఎదగాలంటే స్టార్స్‌ తో కలిసి నటించాలి. ఈ విషయం పాయల్‌ రాజ్‌పుత్‌ కూడా తొందరగానే గ్రహించింది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ వంటి సినిమాలో బోల్డ్‌ పాత్ర చేసిన పాయల్‌ కు ఆశించిన స్థాయి అవకాశాలు రాలేదని చెప్పవచ్చు. సక్సెస్‌తో కెరీర్‌ మొదలైనప్పటికీ ఈ పరిస్థితి ఎదురవడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. 

 

దానికి ఉదాహరణ గా పాయల్.. మొదట బోల్డ్ సినిమా లో నటించిన స్టార్ హీరో వెంకటేష్ సరసన నటించి స్టార్ హీరోయిన్ అయింది..తనపై ఉన్న బోల్డ్‌ ముద్రను చెరిపేసుకునే ప్రయత్నం లో ఉందని అంటున్నారు. ఇక ముందుకు అలాంటి పాత్రలకు దూరం గా ఉంటే స్టార్‌ హీరోయిన్‌ గా ఎదగొచ్చని ఆమె భావిస్తోంది. నిర్మాణం లో ఉన్న డిస్కోరాజాపై పాయల్‌ ఎన్నో ఆశలు పెట్టుకుంది. వెంకిమామ సినిమా తర్వాత ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినా కూడా నో అంటుంది.. పెద్ద హీరో లను టార్గెట్ చేస్తూ వస్తోంది.  మరి ఫాయల్ ఆశలు ఏ మాత్రం తీరతాయి చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: