యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా రూలర్. హ్యాపీ మూవీస్, సికె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్స్ గా నటించగా చిరంతన్ భట్ సంగీతాన్ని అందించారు. ఇకపోతే ఈనెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై మొదటి రోజు నుండే చాలా వరకు నెగటివ్ టాక్ వినిపించింది. 

 

పరువు హత్యల నేపథ్యంలో, అలానే రైతులకు సంబంధించి ఒక మంచి మెసేజ్ తో తెరకెక్కిన ఈ సినిమాలో వయొలెన్స్, మాస్ అంశాలు మరింత ఎక్కువగా ఉండడంతో పాటు సినిమాలోని కథ మరియు కథనాలు ఆసక్తికరంగా లేకపోవడంతో మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమాపై పెదవి విరిచారు. బాలయ్య రెండు రకాల విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించిన ఈ సినిమాలో భూమిక, జయసుధ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ ఏడాది బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలైన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ఘోరంగా ఫ్లాప్ కావడంతో, ఈ రూలర్ సినిమా తప్పకుండా హిట్ సాధించి బాలయ్యకు మంచి సక్సెస్ ని అందిస్తుందని ఫ్యాన్స్ భావించారు.

 

అయితే వారు ఆశించిన విధంగా కాకుండా ఈ సినిమా కూడా బాలయ్య ఖాతాలో మరొక ఫ్లాప్ దిశగా పనయిస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 
ఇప్పటికే ఏ సెంటర్స్ లో ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయని, ఇక బి, సి సెంటర్స్ కూడా పర్వాలేదనిపించే విధంగా మాత్రమే కలెక్షన్స్ ని ఈ సినిమా రాబడుతున్నట్లు చెప్తున్నారు. నేడు క్రిస్మస్ పండుగ కావడంతో మెజారిటీ ఏరియాల్లో ఈ సినిమా ఫుల్ అవుతుందని నిర్మాతలు భావించారు. అయితే ఈ రోజున కూడా చాలా ప్రాంతాల్లో ఈ సినిమా పేలవంగానే కలెక్షన్ రాబట్టిందట. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఈ రూలర్ సినిమా సీన్ మరికొద్ది రోజుల్లో ఓవర్ అవడం ఖచ్చితంగా ఖాయం అని అంటున్నారు. మరి మున్ముందు ఈ సినిమా ఎంత మేర కలెక్ట్ చేస్తుందో తెలియాలంటే మరికొద్దిరోజలు ఓపిక పట్టాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: