ఇలియానా.. ఒకప్పుడు తన అందచందాలతో ప్రేక్షకుల మనసును దోచుకుంది. బడా స్టార్స్ తో జతకట్టింది. టాలివుడ్ లో తన కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న టైం లో బాలివుడ్ కి వెళ్లిపోయింది. కాని తరువాత కొంత కాలం గ్యాప్ తీసుకుంది అయితే ప్రస్తుతం ఇలియానాకి బాలివుడ్ లో మంచి అవకాశాలు దక్కడంలేదు. ఇక టాలివుడ్ లో నిర్మాతలు ఇలియానాని మార్చిపోయారనే చెప్పుకోవాలి. 

 

ప్రజంట్ ఇలియానా బాలివుడ్ లో అరకొర ఆఫర్స్ తో కెరియర్ ను నెట్టకొస్తుంది. చివరగా పాగల్ పంతి చిత్రంలో నట్టించింది. అయితే తాజాగా ఇలియానా మరో ఆఫర్ దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.  గతేడాది అజయ్ దేవ్ గన్ తో నటించిన రైడ్ సినిమా మంచి విజయం సాధించింది. 

 

అయితే ఈ రైడ్ సినిమా సీక్వల్ ను తెరకెక్కించాలని అజయ్ దేవగన్  ఫిక్స్ అయ్యారట. రైడ్ సినిమాలో అజయ్ దేవ్ గన్ ఇలియానా మద్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్  అయినందున ఈసినిమాలో కూడా ఇలియాననే హీరోయిన్ గా తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇలియానాని సంప్రదించినట్లు టాక్ కూడా వినిపిస్తుంది. 

 

గతేడాది రాజ్ కుమార్ గప్త దర్శకత్వంలో తెరకెక్కిన రైడ్ సినిమా హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ సీక్వల్ కి ఆయనే దర్శత్వం వహిస్తారా లేదా మరింకెవరైనా డైరెక్ట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా ఇలియానాకు ఈ ఆఫర్ ఫైనల్ అయితే బాలివుడ్ లో మరిన్ని ఆఫర్లు దక్కే అవకాశం కనిపిస్తుంది. 

 

ఇటు తెలుగులో కూడా ఇలియానాకి చుక్కెదురైందనే చెప్పుకోవచ్చు. చాలా గ్యాప్ తరువాత రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంధోని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాని ఈ సినిమా ప్లాప్ లిస్ట్ లో చేరింది. ఈ ప్లాప్ తో ఇలియానాకి టాలివుడ్ లో ఆఫర్స్ కరువయ్యాయనె చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: