పోస్టాఫీస్ లో న‌గ‌దు జ‌మ చేసే ఖాతాదారుల‌కు ఇక నుంచి రూల్స్ వ‌చ్చాయి. డిపాజిట‌ర్లు జ‌మ చేసే ఖాతాదారులు చెక్ ద్వారా ఇత‌ర హోం బ్రాంచుల్లో కూడా డిపాజిట్ చేసుకోవ‌చ్చు. క‌స్ట‌మ‌ర్ల నుంచి అధిక సంఖ‌య‌లో ఫిర్యాదులు రావ‌డంతో పోస్ట‌ల్ డిపార్టుమెంట్ ఈ కొత్త రూల్‌ని తీసుకువ‌చ్చింది. 

 


మొన్నటివరకూ ఒక రోజులో నాన్ హోం బ్రాంచులో గరిష్టంగా రూ.25వేల వరకు మాత్రమే డిపాజిట్ చేసే అవకాశం ఉంది. తపాలా కార్యాలయాల్లోని PPF, పోస్టు ఆఫీసు చిన్నమొత్తాల్లో పొదుపు (POSS) పథకాలు, సుకన్య సమృద్ధి అకౌంట్ (SSA), రికరింగ్ డిపాజిట్ (RD) పొదుపు ఖాతాల్లో మునపటి రూ.25వేల పరిమితే వర్తిస్తుందని డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్టు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే  ఏదైనా కోర్ బ్యాంకింగ్ సొల్యుషన్స్ బ్రాంచ్ లేదా CBS జారీ చేసిన తపాల కార్యాలయ సేవింగ్స్ బ్యాంకులు లేదా అన్ని POSB చెక్కులను ఇతర తపాల శాఖ బ్రాంచుల్లో స్వీకరించుకునే అవ‌కాశం ఉంది.   కానీ, క్లియరన్స్ కోసం పంపడం జరగదు. నాన్ హోం బ్రాంచ్ డిపాజిట్లపై మాత్రం గరిష్ట పరిమితి వర్తించదు.

 

‘ఏదైనా CBS పోస్టు ఆఫీసు జారీ చేసిన అన్ని POSB చెక్కులను ఏదైనా CBS పోస్టు ఆఫీసుల్లో సమర్పిస్తే.. ఆయా చెక్కులను పార్ చెక్కులుగా పరిగణించాలే తప్ప క్లియరెన్స్ కోసం పంపరాదు’ అని డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్టు ఒక ప్రకటనలో తెలిపింది. ఏదిఏమైనా.. పోస్టు ఆఫీసు బ్రాంచ్ ల్లో రూ.25వేల కంటే ఎక్కువ నగదు విత్ డ్రాను నాన్ హోం బ్రాంచుల్లో అనుమతించదు. ఒక రోజులో ఇతర SOL (సర్వీసు ఔట్ లెట్స్) వద్ద క్యాష్ విత్ డ్రాకు రూ.25వేల కంటే ఎక్కువగా POSB చెక్కులను అంగీకరించదని ప్రకటనలో పేర్కొంది. PPF ఖాతాదారులకు ప్రయోజనార్థమై ప్రభుత్వం డిపాజిట్ రూల్స్ సవరించింది.


 
కొత్త రూల్స్ ప్రకారం.. ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్ ఖాతాదారులు రూ.50లకు ఎన్నిసార్లు అయినా మల్టిపుల్స్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఒక ఏడాదిలో మిశ్రమ జమ (కంబైండ్ డిపాజిట్) గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు అనుమతి ఉంటుంది. ఇప్పటివరకూ ఒక ఏడాది కాల పరిమితిలో గరిష్టంగా 12 డిపాజిట్ల వరకు మాత్రమే అనుమతి ఉంది. మ‌రి ఈ కొత్త రూల్స్‌తో డిపాజిట‌ర్ల‌కు ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డుతందా లేక ఇబ్బందుల్లో ప‌డేస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: